సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Manchu Manoj: హీరో కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ అతనికే .. ఎంతంటే

ABN, Publish Date - Sep 12 , 2025 | 09:32 PM

ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ, ఒక సినిమా అంటే.. నెక్స్ట్ సినిమాకు రెమ్యూనరేషన్ డబుల్ అవుతుంది.

Mirai Movie

Manchu Manoj: ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ, ఒక సినిమా అంటే.. నెక్స్ట్ సినిమాకు రెమ్యూనరేషన్ డబుల్ అవుతుంది. మార్కెట్ కొద్దిగా పెరగడం ఆలస్యం.. ఇట్టే పారితోషికం పెంచేస్తూ ఉంటారు. కానీ, పాన్ఇండియా హిట్ కొట్టాక కూడా ఒక కుర్ర హీరో.. ఒకే రెమ్యూనరేషన్ అందుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు తేజ సజ్జా (Teja Sajja).


బాలనటుడిగా కెరీర్ ను ప్రారంభించి రెండు మూడు సినిమాలు హీరోగా చేసి.. హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారాడు తేజ సజ్జా. పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చాకా.. నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. ఇక హనుమాన్ తరువాత మిరాయ్ లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయ్ ఎన్నో అంచనాల నడుమ నేడు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.


సూపర్ యోధగా తేజ సజ్జా తన నటనతో అదరగొట్టేశాడు. ఇక తేజకు ధీటుగా మనోజ్ విలనిజం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మిరాయ్ పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఈ సినిమా కోసం తేజ, మనోజ్ ఎంతెంత రెమ్యూనరేషన్స్ అందుకున్నారో అని చర్చలు మొదలయ్యాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. తేజ కన్నా మనోజ్ కే ఎక్కువ పారితోషికం ముట్టిందని తెలుస్తోంది. హనుమాన్ సినిమాకు తేజ రూ. 2 కోట్లు తీసుకున్నాడట. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా కూడా రెమ్యూనరేషన్ పెంచకుండా ఈ సినిమాకు కూడా అంతే అందుకున్నాడని అంటున్నారు.


ఇక మనోజ్ కు అందరికంటే ఎక్కువ ముట్టిందని, విలన్ రోల్ కు ఆయన రూ. 3 కోట్లు తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రియకు రూ. 2 కోట్లు, హీరోయిన్ రితికా రూ. 50 లక్షలు అందుకుందని సమాచారం. అయితే కుర్ర హీరోకు రెమ్యూనరేషన్ చాలా తక్కువ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే.. ఈ సినిమాలో చేసిన స్టంట్స్ అన్నీ డూప్ లేకుండా తేజనే రిస్క్ చేసి చేశాడు. ఆ లెక్కన అతనికి రెమ్యూనరేషన్ తక్కువనే ఇచ్చారని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Sep 12 , 2025 | 10:01 PM