Manchu Manoj: ఇంకెన్నాళ్లు రెడ్డిల ట్రెండ్.. చౌదరి అని పెట్టుకో
ABN, Publish Date - Dec 17 , 2025 | 02:55 PM
మంచు వారబ్బాయి మంచు మనోజ్ (Manchu Manoj) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబంలో మనోజ్ మాత్రమే ఎక్కువ అభిమానులకు దగ్గరగా ఉంటాడు.
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ (Manchu Manoj) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబంలో మనోజ్ మాత్రమే ఎక్కువ అభిమానులకు దగ్గరగా ఉంటాడు. ట్రోల్స్ ని కూడా పాజిటివ్ గా తీసుకుంటాడు. మిరాయ్ సినిమా తరువాత మనోజ్ లైఫ్ మారిపోయింది. ఒకపక్క విలన్ గా.. ఇంకోపక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న చిత్రాల్లో డేవిడ్ రెడ్డి (David Reddy) ఒకటి. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఏ చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోటుకూరి భరత్ మరియు నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు.
డేవిడ్ రెడ్డి సినిమా 1897-1922 కాలంలో జరుగుతుందని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించి, ఢిల్లీలో పెరిగి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక వ్యక్తి కథ కావడంతో మనోజ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో రామ్ చరణ్, శింబు క్యామియోలో నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ చిత్రంపై హైప్ మరింత పెరిగిపోయింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను మనోజ్ అభిమానులతో పంచుకున్నాడు. డేవిడ్ రెడ్డి నుంచి ఒక చిన్న గ్లింప్స్ రానుంది. స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి పేరుతో వార్ డాగ్ ను ఈరోజు 5గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మనోజ్ చెప్పుకోస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్చేశాడు. ఈ పోస్టర్ లో మనోజ్ పేస్ కనిపించలేదు కానీ, ఒక బైక్ కనిపించింది. అది చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ పోస్టర్ చూసిన ఒక ఒక నెటిజన్.. డేవిడ్ రెడ్డి టైటిల్ పై కామెంట్ చేశాడు. ' ఇంకెన్నాళ్లు బ్రో రెడ్డిల ట్రెండ్.. డేవిడ్ చౌదరి అని పెట్టుకో.. 100, 200 డేస్ పక్కా' అని రాసుకొచ్చాడు. దానికి మనోజ్ ఫైర్ అవ్వకుండా చాలా ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ' నేను ప్రయత్నించాను బ్రో.. వారు వినలేదు' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.