సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Manchu Lakshmi: బెట్టింగ్‌ యాప్‌ల కేసుపై మంచు లక్ష్మీ ఏమన్నారంటే..

ABN, Publish Date - Sep 13 , 2025 | 02:55 PM

మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi) ఇటీవల నిషేదిత బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi) ఇటీవల నిషేదిత బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన వ్యవహారంలో ఈడీ విచారణకు (ED investigation) హాజరైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు ఆగస్టులో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆగస్టు 13న మంచు లక్ష్మిని అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో నటులు ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ దేవరకొండ, రానాలను ఈడీ ప్రశ్నించింది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి స్పందించారు. దర్యాప్తులో ఏం జరిగిందో దాన్ని పక్కనపెట్టి మీడియా మరోదాన్ని హైలైట్‌ చేసిందని ఆమె మండిపడ్డారు.  అసలు ఈ యాప్‌లు ఎక్కడ ప్రారంభమవుతున్నాయి. వీటి ఉనికి ఏంటి అనే సమస్యను అధికారులు ఎందుకు పరిష్కరించడం లేదని ఆమె ప్రశ్నించారు.

‘ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని విచారించాలని వారు భావించడం హాస్యాస్పదంగా ఉంది. అసలు ఇది ఎక్కడ మొదలైందనే దానిపై వారు దృష్టిపెట్టాలి. ఈ విచారణ అంశంపై మీడియాలో నాపై వచ్చిన వార్తలు చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే మేం విచారణ ఒక విషయంలో ఎదుర్కొంటే.. అది తెలుసుకోని మీడియా మరోదాన్ని హైలైట్‌ చేసింది. బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో డబ్బు ఎలా సమకూరుతోంది.. ఎక్కడికి వెళ్తోంది.. అన్నదానిపై  దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదులకు నిధులు వెళ్తున్నాయా.. అనే దానిపై కూడా దృష్టిపెట్టారు. నాకు ఇవేవీ తెలియదు. 100 మంది ఈ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేశారని వారు చెప్పారు. ఆ లిస్ట్‌లో నేనూ ఉన్నానని చెప్పారు. అందుకే నేను విచారణకు వెళ్లాను. ఇదంతా ఒక్క నిమిషం పని’ అని మంచు లక్ష్మి అన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 03:04 PM