సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Manchu Lakshmi: బెట్టింగ్ యాప్స్ కేసులో విచారించిన అధికారులు 

ABN, Publish Date - Dec 23 , 2025 | 03:11 PM

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సీఐడీ (CID) ముందు మంచు లక్ష్మీ (Manchu Lakshmi) మరోసారి హాజరయ్యారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సీఐడీ (CID) ముందు మంచు లక్ష్మీ (Manchu Lakshmi) మరోసారి హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఐడీ అధికారుల ఎదుట ఆమె హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లకు (Betting apps) ప్రచారం చేసిన వ్యవహారంలో ఆ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే వ్యవహారంలో ఇప్పటికే ఈడీ అధికారుల ఎదుట ఆమె హాజరయ్యారు. అలాగే ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, రానా, విజయ్ దేవరకొండ సైతం ఈడీ అధికారుల ముందు హాజరైన సంగతి తెలిసిందే.

ఇక ఇదే కేసులో హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, నటి అమృత చౌదరి కూడా సీఐడీ అధికారుల విచారణకు గతంలో హాజరై వివరణ ఇచ్చిన విషయం విదితమే. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం జరిగిన లావాదేవీలపై గతంలోనే వీరిని అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో బెట్టింగ్ యాప్స్‌కు ఎందుకు ప్రమోట్ చేశారు?. అందుకు ఎంతెంత తీసుకున్నారు?. యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలపై వీరి నుంచి అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది.

Updated Date - Dec 23 , 2025 | 03:11 PM