MSG : మీసాల పిల్లా.. ప్రతి భార్య, భర్తకు కనెక్ట్ అయ్యేలా..
ABN, Publish Date - Oct 13 , 2025 | 07:23 PM
ఇటీవల ఈ చిత్రం నుంచి ‘మీసాల పిల్ల’ అంటూ హీరో, హీరోయిన్‌ను ఆటపట్టించే పాట ప్రోమోను విడుదల చేశారు. భీమ్స్ సంగీతం అందించగా ఉదిత్ నారాయణ ఆలపించారు. చాలా కాలం తర్వాత చిరంజీవి కోసం ఉదిత్ ఈ పాట పాడారు.
అగ్ర హీరో చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana Shankar Varaprasad Garu). అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార కథానాయిక. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘మీసాల పిల్ల’ అంటూ హీరో, హీరోయిన్‌ను ఆటపట్టించే పాట ప్రోమోను విడుదల చేశారు. భీమ్స్ సంగీతం అందించగా ఉదిత్ నారాయణ ఆలపించారు. చాలా కాలం తర్వాత చిరంజీవి కోసం ఉదిత్ ఈ పాట పాడారు. ప్రోమో రిలీజ్ అయిన తర్వాత దీనికి మంచి బజ్ క్రియేట్ అయింది. ‘మీసాల పిల్ల’ లిరికల్ సాంగ్‌ను రెండ్రోజుల క్రితం విడుదల కావాలి. కానీ పలు కారణాల వల్ల డిలే అయింది. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్.
లిరికల్ వీడియోను మంగళవారం సాయంత్రం విడుదల చేయనున్నామని నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ‘చార్ట్‌బస్టర్ సాంగ్ కోసం సిద్ధంగా ఉండండి.. ప్రతి భర్తకు, భార్యకు ఈ పాట కనెక్ట్ అవుతుంది. వెయిట్ అండ్ సీ’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. గతంలో ఉదిత్ నారాయణ చిరంజీవి కోసం 'కైకలూరి కన్నేపిల్లా', 'రామ్మా చిలకమ్మా', 'వానా వానా', 'రాధే గోవింద' వంటి సూపర్‌హిట్ సాంగ్ పాడారు. ఇప్పుడు రాబోతున్న మీసాల పిల్ల పాట ఛార్ట్‌బస్టర్ అవుతుందని మేకర్స్‌తోపాటు అభిమానులు ఆశిస్తున్నారు.