సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Malavika Mohanan: స్టార్‌ హీరోల సినిమాల్లో నాలుగైదు సీన్సే ఉంటాయనుకున్నా..

ABN, Publish Date - Nov 25 , 2025 | 08:43 PM

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళ, మలయాళ చిత్రాల్లో గ్లామర్‌ పాత్రలు పోషించి మెప్పించింది.

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళ, మలయాళ చిత్రాల్లో గ్లామర్‌ పాత్రలు పోషించి మెప్పించింది. తెలుగులో ప్రభాస్‌ (Prabhas) సరసన ‘ది రాజా సాబ్‌’ (The Raja saab) తో చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతుంంది. అందులో ఆమె పోషించిన రోల్‌ గురించి ఓ పాపులర్ నేషనల్ మీడియా నిర్వహించిన సదరన్‌ రైజింగ్‌ సమ్మిట్‌ 2025 లో మాట్లాడారు.

'ది రాజాసాబ్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. జనరల్‌గా స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలకు అంత ప్రాధాన్యం ఉండదు. రెండు పాటలు, నాలుగైదు సీన్లే ఉంటాయి. నేను కూడా రాజాసాబ్‌ చిత్రంలో రెండు, మూడు సీన్లు ఇస్తారని అనుకున్నా. కానీ ఆ విషయంలో నేను లక్కీ. ‘ది రాజా సాబ్‌’లో మంచి రోల్‌ దొరికింది. కథానాయికకు అటువంటి పాత్ర చాలా గొప్ప. అది కూడా డెబ్యూ సినిమాకు ఇలాంటి పాత్ర దొరకడం లక్కీ. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల అవుతోంది. చాలా ఎగ్ఝైటింగ్‌గా ఉన్నాను’ అని అన్నారు. ఈ సినిమాలో మాళవికతోపాటు నిదీ అగర్వాల్‌; రిద్ధి కుమార్‌ ఇతర నాయికలు. ప్రభాస్‌, మాళవిక కాంబినేషన్‌లో రొమాంటిక్‌ సీన్లు మాత్రమే కాదు... హారర్‌ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి.

Updated Date - Nov 26 , 2025 | 07:14 AM