Peddi: పెద్ది ఆఫీస్ లో ప్రత్యేక పూజలు.. దేనికోసం
ABN, Publish Date - Nov 25 , 2025 | 07:22 PM
ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో పెద్ది (Peddi) ఒకటి. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు.
Peddi: ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో పెద్ది (Peddi) ఒకటి. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ షాట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 100 మిలియన్ వ్యూస్ సాధించి షాక్ ఇచ్చింది. కేవలం ఇండియాలోనే కాకుండా అన్ని దేశాల్లో కూడా చికిరి చికిరి సాంగ్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సాంగ్ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. దీని తరువాత ఏ స్టార్ హీరో సాంగ్ రిలీజైనా కూడా చికిరి సాంగ్ అంత ఇంపాక్ట్ ఇచ్చిందా.. ? అని బేరీజు వేసుకునేలా చేసింది. ఇక ఈ ఒక్క సాంగ్ తో పెద్దిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దీంతో అందరి చూపు పెద్ది మీదనే పడింది.
ఇక పెద్ది సినిమాకి ముందు ముందు ఎలాంటి ఆటంకాలు కలగకుండా.. మంచి సక్సెస్ ను అందుకోవాలని మేకర్స్.. శ్రీగురుదత్త హోమాన్ని జరిపించినట్లు తెలుస్తోంది. తాజాగా నేడు వృద్ధి సినిమాస్ ఆఫీస్ లో ఈ హోమం జరిగినట్లు తెలుస్తోంది. నిర్మాత సతీష్ కిలారుతో పాటు పలువురు ఈ పూజలో పాల్గొన్నారని సమాచారం. మరి ఈ ప్రత్యేక పూజల వలన పెద్ది సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.