సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahesh Babu: కంగారుపడి వచ్చేయకండి.. చాలా ఈవెంట్స్ ఉన్నాయి

ABN, Publish Date - Nov 14 , 2025 | 05:08 PM

ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈరోజే ఎదురవుతుంది అంటూ పాటలు పాడుకుంటున్నారు మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులు. రెండేళ్ల నుంచి దర్శకధీరుడు రాజమౌళి Rajamouli)..

SSMB29

Mahesh Babu: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈరోజే ఎదురవుతుంది అంటూ పాటలు పాడుకుంటున్నారు మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులు. రెండేళ్ల నుంచి దర్శకధీరుడు రాజమౌళి Rajamouli).. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు అన్న ఒక్క విషయం తప్ప ఒక్క అప్డేట్ ఇచ్చింది లేదు. దీంతో ఎప్పుడెప్పుడు SSMB29 నుంచి అప్డేట్స్ వస్తాయా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఎట్టకేలకు ఈ నవంబర్ వారి ఎదురుచూపులకు చెక్ పెట్టింది.

గత కొన్ని రోజుల నుంచి గ్లోబ్ ట్రాటర్ పేరుతో జక్కన్న వరుస అప్డేట్స్ ను ఇస్తూనే వస్తున్నాడు. గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతో ఒక ఈవెంట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. నవంబర్ 15 న ఈ ఈవెంట్ జరగనుంది. దీంతో వారం నుంచి ఈ ఈవెంట్ పై హైప్ పెంచడానికి జక్కన్న చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా పోస్టర్స్ ను రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు.

ఇక అక్కడితో ఆగకుండా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కు పాస్ లను నార్మల్ గా కాకుండా పాస్ పోర్ట్ లో ప్రింట్ చేసి మరింత హైప్ తీసుకొచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈ ఈవెంట్ కు అందరికి అనుమతి లేదని, పాస్ పోర్ట్ ఉంటేనే రావాలని తెలుపుతూ జక్కన్న, మహేష్.. అభిమానులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. అభిమానుల గురించి తెల్సిందే.. తమ అభిమానం హీరో ఈవెంట్ అంటే ఎలాగైనా చూడాలని.. ఎంత రిస్క్ అయినా చేస్తారు. అలాంటి సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే అటు చిత్ర బృందంతో పాటు ఇటు అభిమాని కుటుంబం కూడా బాధపడాల్సి వస్తుంది. అందుకే ఈసారి జక్కన్న, మహేష్ బాబు ముందు జాగ్రత్తలు గట్టిగా తీసుకున్నారు.

తాజాగా మహేష్ బాబు ఈవెంట్ కు ఎలా రావాలి.. ఎవరు రావాలి అనేది తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అందులో మహేష్ మాట్లాడుతూ.. 'అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలి. ఈవెంట్ రోజున RFC (రామోజీ ఫిల్మ్ సిటీ) ,మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉంటాయి. మీతో పాసెస్ ఉంటేనే రండి.. మీకు ఇచ్చిన పాసెస్ లో QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మీరు ఏ గేట్ నుంచి వెళ్లాలో చూపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇచ్చిన సూచనలను పాటించండి. పోలీసులకు సహకరించండి. పోలీసులు మీకు ఇచ్చిన సూచనలు ఏంటంటే.. అందరూ ఎంత తక్కువ ట్రాన్స్ పోర్ట్ తో వస్తే అంత మంచిది. మనందరం ఒక స్పెషల్ ఈవెంట్ కోసం కలుస్తున్నాం. దాన్ని సేఫ్ గా ఒక జ్ఞాపకంగా మార్చుకుందాం. పాస్ పోర్ట్స్ లేకుండా కంగారుపడి వచ్చేయకండి.. మనకింకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. రేపు సాయంత్రం కలుద్దాం' అంటూ చెప్పుకొచ్చాడు.

Updated Date - Nov 14 , 2025 | 05:28 PM