సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahesh Babu: మహేష్ బాబు ఇంట విషాదం.. నమ్రత పోస్ట్ వైరల్

ABN, Publish Date - Dec 17 , 2025 | 10:02 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇంట విషాదం చోటుచేసుకుంది. మహేష్ కుటుంబం ఎంతో ప్రేమగా పెంచుకున్నకుక్క నోబు మరణించింది.

Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇంట విషాదం చోటుచేసుకుంది. మహేష్ కుటుంబం ఎంతో ప్రేమగా పెంచుకున్నకుక్క నోబు మరణించింది. దీంతో మహేష్ ఇంట విషాదం నెలకొంది. చిన్నతనం నుంచి మహేష్ కు జంతువులు అంటే ఎంతో ప్రేమ. ఇక నమ్రత కూడా డాగ్స్ ని ఎంతో ప్రేమిస్తుంది. వీరిద్దరూ కలిసి వారి పెళ్లి తరువాత నోబును ఇంటికి తీసుకొచ్చారు. దానినే తమ మొదటి బిడ్డగా చూసుకున్నారు. ఆ తరువాత గౌతమ్, సితార పుట్టాకా.. నోబు వారికి కూడా ఫ్రెండ్ అయిపోయింది. సితార ఎప్పుడు నోబుతోనే కనిపించేది. నమ్రత సైతం తమ కుటుంబంతో ఎప్పుడు ఫోటోలు దిగినా పక్కన నోబు కూడా ఉండాల్సిందే.

నోబును ఎప్పుడు నమ్రత సొంత బిడ్డగానే చూసుకుంది. ఇక ఇప్పుడు నోబు లేడు అని ఆమె ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. నోబుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. తన బాధను వ్యక్తపరిచింది. నోబు, మేము నిన్ను చాలా మిస్ అవుతాము. నువ్వు ఎల్లప్పుడూ మా ప్రార్థనలలో ఉంటావు. నువ్వే మా మొదటి పెద్ద బిడ్డవి .ఎప్పటికీ అలాగే ఉంటావు... నీకు మా ప్రేమను మరియు ఆశీస్సులను పంపుతున్నాము.' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక నోబు మృతిపై నెటిజన్స్ కూడా సంతాపం తెలుపుతున్నారు.

మహేష్ బాబు సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ భారీ అంచనాలను రేకెత్తించాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి రికార్డులను తిరగరాస్తాడో చూడాలి.

Updated Date - Dec 17 , 2025 | 10:02 PM