Darshan: వారణాసిలో మహేష్ మేనల్లుడు.. అచ్చుగుద్దినట్లు ఉన్నాడే
ABN, Publish Date - Nov 25 , 2025 | 06:31 PM
ఒకప్పుడు బాలనటుల గురించి చెప్పాలంటే వారు చేసిన సినిమాలు, నటన, అవార్డ్స్ అని చెప్పుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు అలా చెప్పుకొనే బాలనటులే లేరు.
Darshan: ఒకప్పుడు బాలనటుల గురించి చెప్పాలంటే వారు చేసిన సినిమాలు, నటన, అవార్డ్స్ అని చెప్పుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు అలా చెప్పుకొనే బాలనటులే లేరు. ఒక సినిమాలో స్టార్ హీరో చిన్నప్పటి క్యారెక్టర్ లో కనిపించిన బాలనటుడు.. వెంటనే మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. దీంతో ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ బాలనటులు లేరు అనే చెప్పాలి. దీంతో కొత్తవారిని డైరెక్టర్స్ ఎంచుకోక తప్పడం లేదు. ఇక ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల తనయులు, డైరెక్టర్స్ తనయులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా పరిచయమవుతున్నారు. గోపీచంద్ మలినేని కొడుకు.. క్రాక్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇక మనం సినిమాలో ఉన్న బుడ్డోడు కూడా డైరెక్టర్ కొడుకే. తాజాగా మరో స్టార్ హీరో కొడుకు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా మరోసారి కనువిందు చేయడానికి సిద్దమవుతున్నాడు.
హీరో సుధీర్ బాబు ఇద్దరు కొడుకులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగ అభిమానులను అలరించినవారే. ముఖ్యంగా చిన్న కొడుకు దర్శన్.. రెండు సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు దర్శన్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఏకంగా ప్రభాస్, మహేష్ బాబు సినిమాల్లో దర్శన్ నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమాలో చిన్నప్పటి మహేష్ గా దర్శన్ కనిపిస్తున్నాడట.
కొంచెం అటుఇటుగా మామ పోలికలు దర్శన్ లో కూడా కనిపిస్తున్నాయి. చిన్నప్పటి మహేష్ లా అచ్చు గుద్దినట్లు సరిపోతాడు. అందుకే జక్కన్న దర్శన్ ను ఎంపిక చేసుకున్నాడట. ఇక వారణాసిలోనే కాకుండా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ లో కూడా చిన్నప్పటి ప్రభాస్ రోల్ లో దర్శన్ నటిస్తున్నాడని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఇదే కనుక నిజమైతే దర్శన్ భవిష్యత్ కి మంచి పునాది పడినట్లే అని చెప్పొచ్చు. మరి సుధీర్ బాబు వీటిపై స్పందిస్తాడేమో చూడాలి.