Andhra King Taluka: రామ్ పాడిన సాంగ్ ప్రోమో వచ్చేసింది

ABN , Publish Date - Sep 06 , 2025 | 05:14 PM

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka). మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

Andhra King Taluka

Andhra King Taluka: ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka). మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కోసం రామ్ చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే మొదటి సాంగ్ కోసం లిరిసిస్ట్ గా మారిన రామ్ .. సెకండ్ సాంగ్ కోసం సింగర్ గా మారాడు. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ పప్పీ షేమ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. రామ్ కాలేజ్ స్టూడెంట్ సాగర్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇక కాలేజ్ లో మరో స్టూడెంట్ ను ఏడిపించే సాంగ్ లా అనిపిస్తుంది. అయ్యాయ్య్యో పోయే.. అరే పప్పీ షేమే ఆయే అంటూ సాగిన ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రామ్ ని ఇలా చూస్తుంటే దేవదాస్ సినిమాలోని కాలేజ్ స్టూడెంట్ లానే అనిపిస్తున్నాడు.


ఇక పప్పీ షేమ్ ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 8 న రిలీజ్ కానుంది. భాస్కరభట్ల లిరిక్స్ అందించిన ఈ సాంగ్ కు వివేక్ శివ, మెర్విన్ సోలమన్ సంగీతం అందించారు. ఈ సాంగ్ కూడా.. చార్ట్ బస్టర్ గా మారుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా నవంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Karuna Kumar: 'ప్రొద్దుటూరు దసరా’లో ఏం చెప్పారంటే.. 

SIIMA 2025: పవన్‌ మాటలకు.. గాల్లో తేలిపోయినట్లైంది..

Updated Date - Sep 06 , 2025 | 05:14 PM