సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahesh Babu: కళరిపయట్టు.. శిక్షణ‌ తీసుకుంటున్న మ‌హేశ్ బాబు

ABN, Publish Date - Dec 23 , 2025 | 06:00 PM

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రస్తుతం రాజమౌళి (SS rajamouli) తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ (Varanasi) చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు సంబంధించిన మేకోవర్స్‌, కసరత్తులు ఇలా బిజీబిజీగా సాగిపోతుంది.

maheshbabu

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రస్తుతం రాజమౌళి (SS rajamouli) తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ (Varanasi) చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు సంబంధించిన మేకోవర్స్‌, కసరత్తులు ఇలా బిజీబిజీగా సాగిపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం మహేశ్‌ గుర్రపుస్వారీ నేర్చుకున్నారని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆయన మరో కసరత్తు చేస్తున్నారు. ప్రాచీన భారత యుద్థ కళ కలరిపయట్టు నేర్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయకు ట్రైనింగ్‌ ఇచ్చిన  హరికృష్ణ షేర్‌ చేసిన పోస్ట్‌ వల్ల తెలిసింది. ‘కలరిపయట్టు’ అనేది పురాతన కేరళ యుద్థ కళ. దీనినుంచే కుంగ్‌ ఫు, కరాటే, తైక్వాండో వంటి ఎన్నో మార్షల్‌ ఆర్ట్స్‌ పుట్టుకొచ్చాయి. దీన్ని సాధన చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా శక్తిని పొందొచ్చు’ అని ఆయన అన్నారు.



ఈ చిత్రంలో ఆయన ‘రుద్ర’ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం ఆయన కలరిపయట్టు నేర్చుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ మహేశ్‌కు ట్రైనింగ్‌ ఇచ్చారు. తాజాగా హరికృష్ణ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘గత సంవత్సరం మహేశ్‌ సర్‌కు శిక్షణ ఇచ్చాను. కానీ సమయం వచ్చేవరకూ ఆ విషయాన్ని బయటపెట్టొద్దని చిత్ర బృందం కోరింది. అందుకే ఇప్పటివరకూ బయటకు రానివ్వలేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు వర్క్‌ చేస్తానని అసలు అనుకోలేదు. ఆయనకు ట్రైనింగ్‌ ఇవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది’ అని అన్నారు. ‘ఈ ఏడాది జనవరిలో వారణాసి షూటింగ్‌కు వెళ్లే ముందే మహేశ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నారు. కలరిపయట్టు కూడా అందులో భాగమే. నేను ఆయన కంటే చాలా చిన్నవాడిని కానీ, ఆయన నన్ను గౌరవించిన విధానం చూసి ఆశ్చర్యపోయాను. నేను చెప్పిన ప్రతి పనీ చేసేవారు. మొదట అనుకున్న పీరియడ్‌ కంటే ఎక్కువ నెలలు ట్రైనింగ్‌ ఇచ్చాను’ అని అన్నారు. ఐమ్యాక్స్‌ వెర్షన్‌లోనూ రూపొందుతున్న ఈ సినిమా 2027 వేసవిలో విడుదల చేయనున్నారు.  

Updated Date - Dec 23 , 2025 | 10:42 PM