సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahesh - Rajamouli: 'వారణాసి' ఈవెంట్.. మహేష్ పోస్ట్ వైరల్

ABN, Publish Date - Nov 16 , 2025 | 04:58 PM

మహేశ్‌బాబు (Maheshbabu) హీరోగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న చిత్రం ‘వారణాసి’ (Varanasi).  శనివారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో  టైటిల్‌ గ్లింప్స్ విడుదల  చేశారు.

మహేశ్‌బాబు (Maheshbabu) హీరోగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న చిత్రం ‘వారణాసి’ (Varanasi).  శనివారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో  టైటిల్‌ గ్లింప్స్ విడుదల  చేశారు.  దీనిపై సోషల్‌ మీడియాలో మహేశ్‌ పోస్టు పెట్టారు. ‘చాలా దూరం నుంచి వచ్చి, మా టీమ్‌పై ప్రేమ కురిపించిన నా అభిమానులు, మీడియా, ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. అతి త్వరలోనే మరోసారి కలుద్దాం’ అని అన్నారు. ఈ మేరకు ‘వారణాసి’ వీడియోను షేర్‌ చేశారు. 

దీనిపై రాజమౌళి కూడా పోస్టు పెట్టారు. వేడుకకు వచ్చిన వారందరికీ థాంక్స్‌ చెప్పారు. ‘వారణాసి’ ఈవెంట్‌కు చాలా దూరం నుంచి వచ్చిన మహేశ్‌ ఫ్యాన్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. చలిలో 3కి.మీ.నడుస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. గ్లింప్స్‌ ప్రదర్శన విషయంలో ముందుగా మా వైపు నుంచి సమస్య ఉన్నా మీ ఓపిక ఏ మాత్రం తగ్గలేదు. మీ అభిమాన హీరో ఎంత క్రమశిక్షణతో ఉంటారో మీరూ అలాగే ఉన్నారు. నిన్నటి వేడుకలో మాతో నిలిచిన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ పెద్ద థాంక్స్‌’అని రాజమౌళి పేర్కొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 05:00 PM