సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahavatar Narsimha: ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా .. ఓటీటీకి వచ్చేస్తుంది

ABN, Publish Date - Sep 18 , 2025 | 09:12 PM

కొన్ని సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అంటే థియేటర్ లో చూడలేక అని కాదు.. అలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసిన తనివితీరదు కాబట్టి.

Mahavatar Narsimha

Mahavatar Narsimha: కొన్ని సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అంటే థియేటర్ లో చూడలేక అని కాదు.. అలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసిన తనివితీరదు కాబట్టి. అలా ఎన్నిసార్లు చూసిన తనివితీరని సినిమాల్లో మహావతార్ నరసింహా (Mahavatar Narsimha) ఒకటి. యానిమేషన్ సినిమాగా తెరకెక్కినా కూడా రికార్డ్ కలక్షన్స్ కురిపించి ఇండస్ట్రీనిషేక్ చేసింది. కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.


మహావతార్ నరసింహా జూలై 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కేవలం కన్నడ లోనే కాకుండా అన్ని భాషల్లో విజయకేతనం ఎగరవేసింది. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 340 కోట్లు వసూళ్లు చేసి షాక్ ఇచ్చింది. తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలను కూడా దాటి నరసింహా రికార్డులు సృష్టించింది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక కలక్షన్స్ రాబట్టిన సినిమాగా ఒక రికార్డ్ సృష్టిస్తే.. 50 రోజులు విజయవంతంగా థియేటర్ లో రన్ అయ్యి రూ. 340 కోట్లు సాధించి ఇంకో రికార్డ్ సృష్టించింది.


ఇక దాదాపు రెండు నెలల తరువాత ఈ యానిమేషన్ సినిమా ఓటీటీ బాట పట్టింది. మహావతార్ నరసింహా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 19 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా తెలిపింది. ఇక ఈ విషయం తెలియడం సినిమా చూడనివారే కాదు చూసిన వారు కూడా దానికోసమే వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహావతార్ నరసింహా కథ అందరికీ తెల్సిందే. రాక్షస రాజు హిరణ్య కశిపుడు పుట్టుక.. చావు. అతడి కుమారుడు ప్రహ్లదుడు భక్తి అన్ని ఇందులో చూపించారు. ఇది కేవలం పిల్లల కోసమే కాదు. పెద్దలు కూడా ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా చూడడం విశేషం.

Swayambhu: ఎట్టకేలకు ఒక పెద్ద అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. చాలు సామీ

Venkatesh: చెప్పుతో ఆయన్ను కొట్టుకొని.. ఆ తరువాత నటుడిని కొట్టిన వెంకటేష్

Updated Date - Sep 18 , 2025 | 09:12 PM