సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahavatar Narasimha: ఈ సినిమాను పవన్‌ చూడాలి

ABN, Publish Date - Aug 04 , 2025 | 06:07 AM

‘మా కుటుంబంలో, సన్నిహితులు, పరిచయం ఉన్నవారందరిలో సనాతన ధర్మం గురించి పవన్‌ కల్యాణ్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆయన...

‘మా కుటుంబంలో, సన్నిహితులు, పరిచయం ఉన్నవారందరిలో సనాతన ధర్మం గురించి పవన్‌ కల్యాణ్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆయన సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అందరూ ముగ్దులవుతారు. ‘మహావతార్‌ నరసింహ’ సినిమాని ఆయన చూడాలని, దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించిన ‘మహావతార్‌ నరసింహ’ సినిమా ఇటీవలె విడుదలై మంచి ప్రేక్షకాదరణతో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘భారతదేశమంతటా ప్రేక్షకులు ఈ సినిమాకు జేజేలు పలుకుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఎంబీలో 200 మంది స్వాములు ఈ చిత్రాన్ని చూడటం నాకు చాలా ఆనందంగా అనిపించింది’ అని అన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 06:07 AM