సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahat Raghavendra: న్యూ లుక్ తో టాలీవుడ్ కు రీ-ఎంట్రీ

ABN, Publish Date - Nov 23 , 2025 | 01:58 PM

బ్యాక్ బెంచ్ స్టూడెంట్, లేడీస్ అండ్ జెంటిల్ మేన్ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ లో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో మహత్ రాఘవేంద్ర.

బ్యాక్ బెంచ్ స్టూడెంట్, లేడీస్ అండ్ జెంటిల్ మేన్ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ లో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో మహత్ రాఘవేంద్ర. మంగాత, జిల్లా, చెన్నై 28 పార్ట్ 2 వంటి పలు సక్సెస్ ఫుల్ తమిళ చిత్రాలతో పాటు 'డబుల్ ఎక్స్ ఎల్' వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి పేరు తెచ్చుకున్నారీ యంగ్ టాలెంటెడ్ హీరో. మహత్ రాఘవేంద్ర ఇప్పుడు తిరిగి టాలీవుడ్ కు రాబోతున్నారు. కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, న్యూ లుక్ తో మహత్ రాఘవేంద్ర ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇప్పుడు  ఐశ్వర్య రాజేశ్ తో మహత్ రాఘవేంద్ర ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు తిరిగి రావడం హ్యాపీగా ఉందని మహత్ రాఘవేంద్ర తెలిపారు. తనను ఇప్పటిదాకా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు మరోసారి తమ లవ్ అండ్ సపోర్ట్ అందిస్తారని ఆయన ఆశిస్తున్నారు. టాలీవుడ్ రీ ఎంట్రీ పట్ల ఎగ్జైటింగ్ గా ఉన్నానని, ఇది తన కెరీర్ కు కొత్త ఛాప్టర్ అవుతుందని మహత్ రాఘవేంద్ర చెప్పారు.

Updated Date - Nov 23 , 2025 | 02:04 PM