Maha Kali: ఫిమేల్ సూపర్ హీరో మూవీ మొదలైంది...
ABN , Publish Date - May 13 , 2025 | 10:56 AM
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ, కథనం అందిస్తున్న 'మహాకాళి' షూటింగ్ మొదలైంది. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బెంగాల్ నేపథ్యంలో రూపుదిద్దుకోబోతోంది.
'హనుమాన్' (Hanu-Man) సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). ఆ సినిమా సాధించిన విజయంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్ష్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తామని తెలిపాడు. కేవలం తన దర్శకత్వంలోనే కాకుండా ఇతరుల దర్శకత్వంలోనూ ఈ యూనివర్స్ లో సినిమాలు ఉంటాయని చెప్పాడు. ఇప్పటికే 'జై హనుమాన్' (Jai Hanuman) ను స్వీయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తో కలిసి నిర్మిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అలానే పూజ అపర్ణ కొల్లూరు (Puja Aparna Kolluru) దర్శకత్వంలో ఆర్.కె.డి. స్టూడియ్స్ రివాజ్ రమేశ్ దుగ్గల్ తో కలిసి 'మహా కాళీ' (Mahakali) మూవీని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మే 12న నిరాడంబరంగా ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా తెలిపారు. దీనికి నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో పాటు ప్రశాంత్ వర్మ కథ, కథనం అందిస్తున్నారు. ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలతో మిళితమై ఈ సినిమా ఉండబోతోంది. ఇది భారతదేశంలోనే ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో, యూనివర్స్ లో మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో (Super Hero) మూవీ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
'మహాకాళి' చిత్రం బెంగాల్ లోని గొప్ప సాంస్కృతిక బ్యాక్ డ్రాప్ తెరకెక్కుతోంది. దానికి తగ్గట్టుగానే బెంగాల్ నగరం, హౌరా బ్రిడ్స్ ను చూపిస్తూ ఓ పోస్టర్ ను డిజైన్ చేశారు. కాళీ దేవికి అనుసంధానించబడిన ఆ ప్రాంతాన్ని, అక్కడి సంస్కృతిని అద్భుతమైన విజువల్స్ తో, ఎమోషనల్‌గా గ్రిప్పింగ్ కథనంతో తెర మీద చూపుబోతున్నట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. భారతీయ మహిళలలోని వైవిధ్యాన్ని, అచంచలమైన స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకునేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఐమాక్స్ త్రీ-డీ లో 'మహాకాళి' చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Also Read: Bhool Chuk Maaf: మళ్ళీ మళ్ళీ... అక్కడే...
Also Read: Bollywood: అక్తర్ సాబ్ దీనికేమంటారు!?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి