సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akhil Akkineni, Zainab: వైభ‌వంగా.. అఖిల్ అక్కినేని, జైనాబ్‌ పెళ్లి! ఫొటోలు వైర‌ల్

ABN, Publish Date - Jun 06 , 2025 | 11:34 AM

అక్కినేని వారసుడు అక్కినేని నాగార్జున‌, అమ‌ల‌ల త‌న‌యుడు అఖిల్ శుక్ర‌వారం ఓ ఇంటి వాడయ్యాడు.

akhil

అక్కినేని వారసుడు అక్కినేని నాగార్జున‌, అమ‌ల‌ల త‌న‌యుడు అఖిల్ (Akhil Akkineni) శుక్ర‌వారం ఓ ఇంటి వాడయ్యాడు. శుక్రవారం ఉదయం అన్న‌పూర్ణ‌ స్టూడియోలో జ‌రిగిన వేడుక‌లో అఖిల్, జైనాబ్ రవ్దీ (Zainab Ravdjee)లు మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

ఈ పెళ్లి వేడుకకు చిరంజీవి, రామ్‌ చరణ్‌, వెంకటేష్‌, రానా, ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పెద్దెత్తున త‌ర‌లి వ‌చ్చారు.హాజరయ్యారు. జూన్ 8వ తేదీన పెళ్లి రిసెప్షన్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట హాల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇదిలాఉంటే.. గ‌త నాలుగేళ్లుగా ప్ర‌మ‌లో ఉన్న అఖిల్, జైనాబ్‌ల రిసెప్స‌న్ గ‌త నవంబ‌ర్‌లో గ్రాండ్‌గా జ‌రుగ‌గా ఇప్పుడు వారు పెళ్లితో ఒక్క‌ట‌య్యారు. థియేటర్ ఆర్టిస్ట్, పెయింట‌ర్ అయిప‌ జైనాబ్ రావుద్జీ పుట్టింది హైద‌రాబాద్‌లోనైనా ముంబై, ఢిల్లీలో ఎక్కువ‌గా పెరిగింది. జుల్ఫీ రావుద్జీ‌ గల్ఫ్ దేశాల్లో బిగ్ రియల్ ఎస్టేట్ టైకూన్. వేల కోట్ల ఆస్తి కలిగిన కుబేరుడు.

ఆయనకు రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాకుండా ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా కూడా పని చేశారు.ఇక ఆయన కుమారుడు జైన్ రావుద్జీ‌ ZR Renewable Energy Pvt Ltd సంస్థ చైర్మన్, ఎండీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Updated Date - Jun 06 , 2025 | 11:34 AM