సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్‌కు షాక్.. హైకోర్టులో ఎదురు దెబ్బ

ABN, Publish Date - Dec 04 , 2025 | 10:15 AM

ప్రముఖ సంగీత దర్శకుడు ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలను ఉపయోగించుకునేందుకు, రీమిక్స్‌ చేయకుండా విధించిన స్టేను తొలగించాలని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది.

ప్రముఖ సంగీత దర్శకుడు ఇసైజ్ఞాని ఇళయరాజా (ilayaraja) స్వరపరిచిన పాటలను ఉపయోగించుకునేందుకు, రీమిక్స్‌ చేయకుండా విధించిన స్టేను తొలగించాలని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. అజిత్‌, ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోలుగా మైత్రీ మూవీ మేకర్స్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’, ‘డ్యూడ్‌’ చిత్రాలను నిర్మించింది. ఇందులో ఇళయరాజా పాటలను ఉపయోగించారు. వీటిని తొలగించాలని ఇళయరాజా న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఈ నేపథ్యంలో ఇళయరాజా పాటలను ఉపయోగించకుండా విధించిన స్టే తొలగించాలని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్‌ వేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన హైకోర్టు మైత్రీ మూవీ మేకర్స్‌ పిటిషన్‌ కొట్టివేసింది. అలాగే, తన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించేందుకు, రీమిక్స్‌ చేసిన వాటిని అడ్డుకునే హక్కు ఇళయరాజాకు ఉందని న్యాయమూర్తి సెంథిల్‌ కుమార్‌ తీర్పునిస్తూ, ఈ కేసు తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - Dec 04 , 2025 | 10:24 AM