Kalyan Shankar: మ్యాడ్ డైరెక్టర్.. ఈసారి భయపెడతాడట
ABN, Publish Date - Sep 16 , 2025 | 06:04 PM
మ్యాడ్ (Mad) ఫ్రాంచైజీతో తనకంటూ ఇండస్ట్రీలో సపరేట్ గుర్తింపును సంపాదించుకున్నాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar).
Kalyan Shankar: మ్యాడ్ (Mad) ఫ్రాంచైజీతో తనకంటూ ఇండస్ట్రీలో సపరేట్ గుర్తింపును సంపాదించుకున్నాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar). కుర్ర హీరోలతో కామెడీని పంచడమే కాకుండా స్టూడెంట్ లైఫ్ ను అద్భుతంగా చూపించి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ తరువాత కళ్యాణ్ శంకర్.. రవితేజతో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కళ్యాణ్ చెప్పిన కథ రవితేజకు బాగా నచ్చడంతో.. వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లిపోవాలని చూసారు. ఈ సినిమాను కూడా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీనే నిర్మించనున్నాడు.
త్వరలోనే ఈ సినిమా పట్టాలకెక్కుతుంది అనుకుంటే.. సడెన్ గా కళ్యాణ్ శంకర్ రూట్ మార్చాడు. రవితేజ సినిమాను పక్కకు పెట్టి కొత్తగా హర్రర్ జోనర్ లోకి అడుగుపెట్టాడు. అందుతున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ శంకర్ ఒక హర్రర్ స్టోరీని తెరకెక్కించనున్నాడట. ఈ సినిమాను కూడా సితారనే నిర్మించనుంది. మ్యాడ్ లానే ఈ సినిమాను కూడా కామెడీతో పాటు హర్రర్ ను కూడా జోడించి మంచి ఎంటర్ టైనర్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది.
బాయ్స్ హాస్టల్ లో దెయ్యం దూరితే ఎలా ఉంటుంది అనే లైన్ తో కథను అల్లి.. దానికి కామెడీని జోడించి హర్రర్ కామెడీ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడట కళ్యాణ్ శంకర్. ఇక ఈ సినిమాలో హీరోలుగా కొత్త కుర్రాళ్లు అయితేనే బావుంటారని దర్శక నిర్మాతలు అభిప్రాయపడడంతో వారికోసం వేట మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రవితేజతో అనుకున్న మూవీ బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో కొద్దిగా గ్యాప్ తీసుకొని చేద్దామని, ఈలోపు ఫ్రెష్ కంటెంట్ తో ఒక చిన్న సినిమాను నిర్మించాలని నాగవంశీ, కళ్యాణ్ శంకర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Prabhutva Sarai Dukanam: టీజర్.. ఇంత పచ్చిగా ఉందేంటి! బూతులే.. బూతులు
Manchu Lakshmi: షర్ట్ విప్పి ఎందుకు తిరుగుతున్నావని మహేష్ బాబును అడగగలరా