సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maa Ramudu Andarivadu Teaser: అనుబంధాలు, ఆప్యాయతల నేప‌థ్యంలో.. ‘మా రాముడు అందరివాడు’

ABN, Publish Date - Nov 17 , 2025 | 09:42 AM

పల్లె బంధాలు, మనసుకు హత్తుకునే అనుబంధాలు, ఆప్యాయతల నేప‌థ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మా రాముడు అందరివాడు’ సినిమా టీజర్‌ను మేక‌ర్స్ ఆదివారం విడుదల చేశారు.

Maa Ramudu Andarivadu

గ్రామీణ నేపథ్యంలో పల్లె బంధాలు, మనసుకు హత్తుకునే అనుబంధాలు, ఆప్యాయతల నేప‌థ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మా రాముడు అందరివాడు’ సినిమా టీజర్‌ను మేక‌ర్స్ ఆదివారం విడుదల చేశారు. సీనియర్‌ నటుడు సుమన్ కీలక పాత్రలో నటించగా, శ్రీరామ్ (srikanth), స్వాతి (swathi) జంటగా కనిపించనున్నారు. యద్దనపూడి మేఖైల్‌ దర్శకత్వం (YEDDANAPUDI MAIKIL) వహించిన ఈ చిత్రాన్ని అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మించారు.

టీజర్‌ విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, “కుటుంబ భావోద్వేగాలు, వాణిజ్యాంశాలతో నిండిన భారీ యాక్షన్‌ చిత్రమిది. స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది” అని చెప్పారు. మానవ సంబంధాలను హృద్యంగా చూపిస్తూ, మంచి సందేశంతో ముందుకు సాగే చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు. ఇంకా సినిమా పూర్తి వివరాలు, విడుదల తేదీల‌ను త్వరలో వెల్లడించనున్నారు.

Updated Date - Nov 17 , 2025 | 09:42 AM