Love you Raa: విడుదలైన పాటలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:25 PM
పల్లెటూరి ప్రేమకథగా రూపుదిద్దుకున్న 'లవ్ యూ రా' సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా పాటలను మేకర్స్ రిలీజ్ చేశారు.
చిన్ను క్రిష్ (Chinnu Krish) హీరోగా, గీతికా రతన్ (Geethika Ratan) హీరోయిన్‌గా సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మించిన సినిమా 'లవ్ యూ రా' (Love You Raa). ఈ మూవీకి ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ అనే పాటలను లాంచ్ చేశారు.
తదనంతరం జరిగిన మీడియా సమావేశంలో హీరో చిన్ను మాట్లాడుతూ, 'లవ్ యూ రా’ నాకు మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ ప్రయాణంలో మా వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చారు. ‘లవ్ యూ రా’ ఆద్యంతం కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. గీతిక తన పాత్రకు ప్రాణం పోశారు. కృష్ణ సాయి కారెక్టర్ అందరినీ నవ్విస్తుంది. చంద్ర శేఖర్ గారి పాత్ర చాలా బాగా వచ్చింది. మా చిత్రంలో హారర్, కామెడీ, లవ్ ఇలా అన్ని అంశాలుంటాయి. ఈశ్వర్ గారు మాకు మంచి పాటలు ఇచ్చారు. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. మీడియా సపోర్ట్ ఉంటేనే మాలాంటి వాళ్లు ఆడియెన్స్ వరకు చేరుకుంటాం. మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరోయిన్ గీతిక మాట్లాడుతూ .. ‘లవ్ యూ రా’ టీం అంతా కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా మూవీకి పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నిర్మాత శ్రీనాథ్ ప్రజాపతి మాట్లాడుతూ, 'పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో యాక్ట్ చేసినవాళ్ళు ఎక్కడా కొత్త వాళ్ళు అన్నట్టుగా నటించలేదు. ఈ మూవీ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. నేచర్‌లో తీసిన నేచురల్ మూవీ ఇది' అని అన్నారు. దర్శకుడు ప్రసాద్ ఏలూరి మాట్లాడుతూ, 'లవ్ యూ రా’ చిత్రాన్ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నా టీంకు థాంక్స్. మా మూవీని చూసి మెచ్చుకున్న డిస్ట్రిబ్యూటర్ దయానంద్ గారికి థాంక్స్. నాకు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా స్పూర్తి. చిన్న చిత్రాల్ని కూడా మీడియా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. మా మూవీని మీడియా ప్రమోట్ చేయాలని, ఆడియెన్స్ వరకు రీచ్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నటుడు కృష్ణ సాయి మాట్లాడుతూ .. ‘లవ్ యూ రా’ చిత్రం అందరినీ నవ్వించేలా ఉంటుంది. మా దర్శకుడు ఈ చిత్రం గురించి చాలా కష్టపడ్డారు. మా హీరో చిన్ను, హీరోయిన్ గీతిక చక్కగా నటించారు. మా సినిమాను సక్సెస్ చేయాలని ఆడియెన్స్‌ను కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Also Read: Kiara Advani: వరుసగా పరాజయాలే...
Also Read: Nandamuri Padmaja: ఎన్టీఆర్ పెద్ద కోడలు మృతి..