సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Lopaliki ra chepta: ‘లోపలికి రా చెప్తా’. .విజయేంద్రప్రసాద్ శిష్యుడి సినిమా    

ABN, Publish Date - Jun 23 , 2025 | 11:36 AM

కొండా వెంకట రాజేంద్ర (Konda Venkata Rajendra), మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచి రాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లోపలికి రా చెప్తా’.

కొండా వెంకట రాజేంద్ర(Konda Venkata Rajendra), మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచి రాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. జూలై 5న  థియేటర్లలో విడుదల కాబోతోంది. శనివారం హైదరాబాద్ లో ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. రచయిత విజయేంద్రప్రసాద్   ట్రైలర్   విడుదల చేశారు.  

విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘లోపలికి రా చెప్తా’ ట్రైలర్ చూశాక మీలో భయం కలిగే ఉంటుంది. అయితే మనల్ని భయపెట్టే విషయాలు ఈ సినిమాలోలాగే బయట కూడా చాలా జరుగుతున్నాయి. ‘లోపలికి రా చెప్తా’ సినిమా ప్రేక్షకుల్ని భయపెట్టడమే కాదు, వారి దగ్గర నుంచి మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాలని కోరుకుంటున్నా" అన్నారు.
 
శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ "రాజేంద్ర నాకు బాగా పరిచయం. కొత్త ఆలోచనలతో సినిమాలు రూపొందిస్తాడు. ఆయన చేసిన ఓ చిత్రంలో గతంలో నటించాను. లోపలికి వస్తే రా అనే టైటిల్ తో లోపలికి వస్తే ఏం చేస్తారో అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు రాజేంద్ర.ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

దర్శకుడు కొండా వెంకట రాజేంద్ర మాట్లాడుతూ "విజయేంద్రప్రసాద్ గారి శిష్యుడు అనే గుర్తింపు వల్లే నేను ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ సినిమాలకు పనిచేయగలిగాను. స్క్రీన్ ప్లేలో నాకు ఉన్న పదేళ్ల అనుభవంతో ‘లోపలికి రా చెప్తా’ చిత్రాన్ని రూపొందించాను. నాలుగైదు జానర్స్ కలిపి ఈ మూవీకి స్క్రిప్ట్ చేశాను. ఈ సినిమా వెనక రెండేళ్ల హార్డ్ వర్క్ ఉంది.  హారర్, కామెడీతో పాటు యూత్ కు కావాల్సిన రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. దేవ్ జాండ్ మా సినిమాకు ఇచ్చిన సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి" అని అన్నారు. 

Updated Date - Jun 23 , 2025 | 03:55 PM