Mouli Talks: నాని అన్నా.. నీ గోడలో ఇటుక అవుతా
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:56 PM
ప్రస్తుతం ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే కథ ముఖ్యం. అది లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమాలు అయినా ప్లాప్ అవ్వాల్సిందే.
Mouli Talks: ప్రస్తుతం ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే కథ ముఖ్యం. అది లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమాలు అయినా ప్లాప్ అవ్వాల్సిందే. చిన్న సినిమాలతో పెద్ద సినిమాలు పోటీ పడినా కూడా కథ ఉన్న సినిమానే ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇది చాలా చిన్న సినిమాలు నిరూపించాయి. అందులో లిటిల్ హార్ట్స్ (Little Hearts) కూడా ఒకటి. అనుష్క ఘాటీ, శివ కార్తికేయన్ మదరాసి లాంటి పెద్ద సినిమాలతో పోటీగా చిన్న సినిమా అయిన లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
రికార్డ్ కలెక్షన్స్ రాబడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా లిటిల్ హార్ట్స్ ను ప్రశంసిస్తున్నారు. సినిమా బావుంది అంటే.. అది ఎలాంటి సినిమా అయినా కూడా దాన్ని ప్రశంసించడంలో న్యాచురల్ స్టార్ నాని ముందు ఉంటాడు. తాజాగా లిటిల్ హార్ట్స్ సినిమాపై నాని ప్రశంసలు కురిపించాడు. 'లిటిల్ హార్ట్స్.. ఎంత హాయిగా, సరదాగా ఉండే సినిమా. చాలా కాలం తర్వాత హృదయపూర్వకంగా నవ్వుకున్నాను. అఖిల్, మధు, కాత్యాయని (స్పెల్లింగ్ గురించి నాకు సరిగ్గా తెలియదు ). మీరందరూ నా రోజును అద్భుతంగా మార్చారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పను కానీ ప్రస్తుతానికి నేను చెప్పేది ఒకటే.. థాంక్యూ' అంటూ రాసుకొచ్చాడు.
ఇక నాని రివ్యూ చూసి మౌళి తబ్బిబ్బైపోయాడు. అందుకు కారణం.. మౌళి బాగా ఇష్టపడే హీరో నాని. ఈ విషయాన్నీ అతను రీసెంట్ ఈవెంట్ లో కూడా చెప్పుకొచ్చాడు. ఇక తన అభిమాన హీరోనే తన సినిమాపై ప్రశంసలు కురిపించేసరికి మౌళి ఆనందం ఆకాశాన్ని తాకింది. ఇక నాని పోస్ట్ కు రిప్లై ఇస్తూ.. తన అభిమానాన్ని చాటుకున్నాడు. ' చాలా థాంక్స్ నాని అన్నా.. నీకు తెలికపోవచ్చు అన్న కానీ, పిల్ల జమీందార్ నుండి నేను మీకు చాలా పెద్ద అభిమానిని. ఈ సినిమా కన్నా ముందే మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. కానీ, నేనొక అభిమానిలా కాకుండా నా వర్క్ నీకు తెలిశాకే కలుద్దామని ఫిక్స్ అయ్యా. దానికోసమే కష్టపడ్డా. ఈరోజు కొట్టా. మౌళి నాని ఫ్యాన్ ఫరెవర్. ఈరోజు కొత్త ఛాలెంజ్ పెట్టుకున్నా.. ఏదో ఒకరోజు నీ గోడలో ఇటుక అవుతా పక్కా' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Kajal Aggarwal: కాజల్ కి యాక్సిడెంట్.. ఆమె ఏమన్నదంటే
Paradise : నేచురల్ స్టార్ మూవీ కోసం భారీ స్లమ్ సెట్