Premaledhani: లక్ష్మణ్ టేకుముడి బ్రో.. ఇంత షాకిచ్చావేంటి! ‘ప్రేమ లేదని’ టీజర్
ABN, Publish Date - Oct 27 , 2025 | 01:09 PM
లక్ష్మణ్ టేకుముడి (Lakshman Tekumudi), రాధికా జోషి (Radhika Joshi) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమ్ ‘ప్రేమ లేదని’(Premaledhani).
జి.డి.ఆర్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద జి.డి. నరసింహ (GD Narasimmha) దర్శకత్వంలో లక్ష్మణ్ టేకుముడి (Lakshman Tekumudi), రాధికా జోషి (Radhika Joshi) ప్రధాన పాత్రల్లో శ్రీని ఇన్‌ఫ్రా నిర్మించిన చిత్రం ‘ప్రేమ లేదని’(Premaledhani). ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఓ హార్ట్ ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.
లక్ష్మణ్ టేకుముడి, సురేష్ గురు (Suresh Guru)కాంబోలో వచ్చిన కామెడీ సీన్లు, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్లు ఇలా అన్నీ కూడా టీజర్‌ను యూత్‌కు నచ్చేలా కట్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ట్రెండ్‌కు తగ్గ లవ్ స్టోరీతోనే కథను అల్లినట్టుగా కనిపిస్తోంది. జాన్ విక్టర్ పాల్ విజువల్స్, సుహాస్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.