సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kubera: 'కుబేర’ఈవెంట్‌ కొత్త డేట్‌ ఎప్పుడంటే..

ABN, Publish Date - Jun 13 , 2025 | 03:19 PM

ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’ . ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో నిర్వహించాలని టీమ్‌ షెడ్యూల్‌ చేసుకుంది.

ధనుష్‌ (Dhanush) హీరోగా శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) రూపొందించిన చిత్రం ‘కుబేర’ (Kubera).  రష్మిక మందన్నా కథానాయిక. నాగార్జున కీలక పాత్రలో నటించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో నిర్వహించాలని టీమ్‌ షెడ్యూల్‌ చేసుకుంది. అయితే గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా  ఆ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు (Kubera Pre release) సంబంధించిన కొత్త డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. జూన్‌ 15, ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం ముందు అనుకున్నట్లుగానే హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.  శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘‘ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి.. వీధుల్లో జీవించే ఓ అతి పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. ఇందులో హవాలా, మనీలాండరింగ్‌ తదితర అంశాలు మిళితమై ఉంటాయి.  ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల కానుంది.

Updated Date - Jun 13 , 2025 | 03:19 PM