సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Krithi Shetty: బేబమ్మ.. ప్రమోషన్స్‌ కోసమేనా ఇదంతా..

ABN, Publish Date - Dec 08 , 2025 | 10:00 AM

‘ఉప్పెన’ సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది కృతీశెట్టి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్నాళ్ల క్రితం తనకు జరిగిన వింత అనుభవం గురించి ఆమె బయటపెట్టింది.

‘ఉప్పెన’ సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది కృతీశెట్టి (Krithi shetty). అందులో ఆమె పోషించిన బేబమ్మ పాత్ర తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తదుపరి వరుసగా సినిమా అవకాశాలు వచ్చినా ఏదీ చెప్పుకోదగ్గ విజయాన్ని ఇవ్వలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్నాళ్ల క్రితం తనకు జరిగిన వింత అనుభవం గురించి ఆమె బయటపెట్టింది. తల్లితో కలిసి హోటల్‌ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మ లాంటి రూపం కనిపించిందని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘కార్తీ వా వాతియర్‌ (vaa vaathiyaar- అన్నగారు వస్తారు) సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్‌ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మని చూశాను. మేం లైట్‌ వేయగానే పెద్ద శబ్దం వచ్చింది. తర్వాత ఆత్మ కనిపించలేదు. అది నాకు సాయం చేయడానికి వచ్చిందో లేదంటే నేను చేస్తున్న ప్రాక్టీస్‌ వల్ల వచ్చిందో తెలియదు. నాకు మొదటి నుంచి ఆత్మలపై నమ్మకముంది. ఎందుకంటే నేను తుళు జాతికి చెందిన అమ్మాయిని. మా పూర్వీకులను దేవతలుగా పూజిస్తాం. వాళ్లు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతుంటారని మా నమ్మకం. ఈ సంఘటన వల్ల ఆ నమ్మకం మరింత బలపడింది’ అని కృతీశెట్టి అన్నారు.

కార్తీ హీరోగా తాజాగా ఆమె నటించిన చిత్రం ‘వా వాతియర్‌’. తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో  శుక్రవారం థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో కార్తీ.. పోలీసుగా కనిపిస్తారు. కృతిశెట్టి.. ఆత్మలతో మాట్లాడే జిప్సీ తరహా పాత్రలో కనిపించనుంది. అయితే ఇప్పుడు శ్రుతీ మాటల్ని బట్టి చూస్తే ఈ సినిమా ప్రమోషన్‌ కోసమే ఇలా చేస్తుందా? నిజంగా ఈమెకు ఆత్మ కనబడిందా లేదా కల్పించి చెబుతోందా అన్న అనుమానం కలుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుంది.  

 

Updated Date - Dec 08 , 2025 | 10:30 AM