సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Krish: పవన్‌తో విభేదాలు లేవు.. త్వరలో అన్ని బయటకొస్తాయి..

ABN, Publish Date - Jul 26 , 2025 | 05:00 PM

పవన్‌ కల్యాణ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌తో (Pawan Kalyan) తనకు ఎలాంటి విభేదాలు లేవని దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి (Krish) తెలిపారు. 'హరిహర వీరమల్లు' (harihara veeramallu) చిత్రానికి తొలుత ఆయనే దర్శకుడు. తదుపరి నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. అందుకు గత కారణాలు త్వరలోనే బయటకు వస్తాయని క్రిష్‌ అన్నట్లు టాక్‌ నడుస్తోంది. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్‌తో తనకు ఎలాంటి విభేదాలేవని ఆ కథనం సారాంశం. ‘నాకు, పవన్‌కు మధ్య క్రియేటివ్‌ డిఫరెన్స్‌లు ఏమీ లేవు. నేను చాలా క్లియర్‌గా, ఓపెన్‌గా ఉన్నా. భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమా చేసేందుకు సిద్దంగానే ఉన్నా’’ అని క్రిష్‌ చెప్పినట్లు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Alia Bhatt: ‘వార్‌-2’లో ఆలియా.. నిజమేనా..

‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలకు ముందు  పవన్‌పై ప్రశంసిస్తూ క్రిష్‌ ట్వీట్‌ చేశారు. ఆ సినిమా పూర్తి కావడానికి పవన్‌, ఏఎం రత్నం కారణమంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం జనాలకు చేరువైంది. కానీ సెకెండాఫ్‌లో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ అంతగా ఆకట్టుకోలేదని కామెంట్స్‌ వినిపించాయి. దాంతో సినిమా మిశ్రమ స్పందనకే పరిమితమైంది. అయితే ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు వసూళ్లు రాబట్టింది. మొదటి రోజే వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని చెబుతు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

ALSO READ:

Sobhan Babu: బ్లాంక్ చెక్ ఇచ్చినా మహేష్ కు తాతగా చేయను

Murali Mohan - Athadu: అతడు రీ రిలీజ్‌.. ఈసారి పక్కా హిట్‌..

Pawan Fans in London: మీ రూల్స్‌ ఎవరికి చెప్పారు.. ఎక్కడ పెట్టారు..

Shruti Haasan: ఆ ఫెయిల్యూర్స్‌ నా వల్ల జరగలేదు.. కానీ నింద నాపైనే..

Tanushree Dutta: సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌లా చంపే ప్లాన్‌లో..

Updated Date - Jul 26 , 2025 | 05:19 PM