Kothapalli Lo Okappudu: ఆద్యంతం వినోదం
ABN, Publish Date - Jul 15 , 2025 | 05:52 AM
‘ఈ సినిమా ఆద్యంతం వినోదం పంచుతుంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది’ అని అన్నారు...
‘ఈ సినిమా ఆద్యంతం వినోదం పంచుతుంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది’ అని అన్నారు హీరో మనోజ్ చంద్ర. ఆయన కథానాయకుడిగా ప్రవీణ పరుచూరి దర్శకత్వంలో నటించిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మనోజ్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ ‘ఇది ఒక ఊరి కథ. ఇందులో నేను రామకృష్ణ అనే పాత్రలో కనిపిస్తాను. అప్పన్న అనే ఒక వడ్డీ వ్యాపారి దగ్గర పనిచేస్తుంటాను. అప్పులు వసూలు చేయడం నా పని. రామకృష్ణకి ఒక రికార్డింగ్ స్టూడియో కూడా ఉంటుంది. అలాగే సావిత్రి అంటే రామకృష్ణకు ఇష్టం. ఒక రోజు ఆమెను కలవడానికి గడ్డి వాము దగ్గరకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెరపై చూడాల్సిందే. రామకృష్ణ పాత్ర సవాలుతో కూడుకొన్నది. సినిమా అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.