Kota Srinivasarao: కన్నీటి వీడ్కోల మధ్య కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి..
ABN, Publish Date - Jul 13 , 2025 | 05:17 PM
కొద్దిసేపటి క్రితమే కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కన్నీటి వీడ్కోలతో ఆయనను సాగనంపారు.
Kota Srinivasa Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈరోజు ఒక చీకటి రోజు అని చెప్పుకోవచ్చు. ఒక అద్భుత నటుడు ఈ లోకం నుంచి దూరమయ్యారు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) నేటి ఉదయం మరణించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
కొద్దిసేపటి క్రితమే కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కన్నీటి వీడ్కోలతో ఆయనను సాగనంపారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో కోట అంతిమ సంస్కారాలు సాంప్రదాయబద్దంగా జరిగాయి. కోట ఇక తిరిగిరారు అన్న విషయాన్నీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీడ్కోలు.. నేస్తమా అంటూ కోటకు నివాళులు అర్పిస్తున్నారు.