సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Koratala Shiva: రూటు.. మార్చిన కొరటాల! అబ్బాయిని వదిలి.. బాబాయ్‌ దగ్గరికి

ABN, Publish Date - Dec 25 , 2025 | 04:06 PM

గ‌త ఏడాది ఎన్టీఆర్‌తో దేవ‌ర సినిమా తెర‌కెక్కించిన కొర‌టాల శివ రూట్ మార్చారు. బాల‌కృష్ణ‌తో సినిమాకు రెడీ అవుతున్నారు.

koratala

కొరటాల శివ (Koratala shiva)ఒకప్పుడు టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌. బాక్సాఫీస్ వద్ద కొరటాల తీసిన ప్రతి సినిమా కాసుల వర్షం కురిపించేది. తీసిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో టాలీవుడ్‌లో తిరుగులేని దర్శకుడిగా ఎదిగారు. అయితే ఆచార్య మిగిల్చిన చేదు జ్ఞాపకం ఆయన కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా మార్చేసింది. గతేడాది ఎన్టీఆర్‌తో ( Jr. Ntr) కలిసి దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అది ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే కొరటాల శివ తన రూటు మార్చారు. ఇప్పుడు అబ్బాయిని వదిలి బాబాయ్ చెంతకు చేరారనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో షేక్ చేస్తోంది.

మిర్చి సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి.. తొలి ప్రయత్నంలోనే తన మార్కు మేకింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు కొరటాల. కథలో సామాజిక బాధ్యత, కమర్షియల్ ఎలిమెంట్స్ రెండూ మేళవించి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య డిజాస్టర్ అవ్వడం కొరటాల ఫేట్‌ను మార్చేసింది. ఆ పరాజయం నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది.

నిజానికి దేవర కథను మొదట అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసుకున్నారు కొరటాల. ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. కానీ ఆచార్య ఫ్లాప్ అవ్వడంతో బన్నీ వెనక్కి తగ్గడం, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన దేవర సినిమా కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించినా.. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ రేంజ్‌కు తగిన హిట్ మాత్రం కాలేకపోయింది. మరోవైపు ఎన్టీఆర్ నటించిన వార్-2 కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో.. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమా పైనే ఉన్నాయి.

మరో వైపు కొరటాల శివ దేవర పార్ట్-1 పూర్తికాగానే పార్ట్-2 వెంటనే ఉంటుందని అందరూ ఆశించారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. దేవర-2 ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అందుకే కొరటాల తన ఫోకస్‌ను నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వైపు మళ్లించారు. రీసెంట్‌గా బాలయ్యను కలిసిన కొరటాల.. ఒక పవర్‌ఫుల్ స్టోరీని వినిపించారట. కథ విన్న వెంటనే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన సింహా చిత్రానికి డైలాగ్స్ అందించిన అనుభవం కొరటాలకు ఉంది. ఇప్పుడు డైరెక్టర్‌గా బాలయ్యను ఎలా చూపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ పీరియాడిక్‌ డ్రామాకు రెడీ అవుతున్నారు. జనవరి నుంచి ఈ షూటింగ్ మొదలుకానుంది. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న కొరటాల శివకు.. మాస్ గాడ్ బాలయ్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారా? అబ్బాయితో మిస్ అయిన మేజిక్‌ను బాబాయ్‌తో రిపీట్ చేస్తారా అన్నది వేచి చూడాలి.

Updated Date - Dec 25 , 2025 | 04:06 PM