సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bellamkonda Sai Srinivas: అమ్మాయి అదృశ్యం వెనుక..?

ABN, Publish Date - Aug 16 , 2025 | 05:20 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘కిష్కిందపురి’.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘కిష్కిందపురి’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. షైన్‌ స్ర్కీన్స్‌ బేనర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను మేకర్స్‌ శుక్రవారం విడుదల చేశారు. టీజర్‌లో మొదటి షాట్‌ నుంచే మిస్టరీ ప్రారంభమవుతుంది. పురాతన బంగ్లాలోకి వెళ్లిన ఓ అమ్మాయి ఒక్కసారిగా అదృశ్యం అవుతుంది. ఇంతలో రేడియో నుంచి ఓ సమాచారం ప్రసారం అవుతుంది. మొత్తానికి టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠతతో అదరగొట్టింది. చైతన్‌ భరద్వాజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ టీజర్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లింది.

Updated Date - Aug 16 , 2025 | 05:20 AM