Junior: కిరీటి మరో ప్రామిసింగ్ హీరో అవుతాడు
ABN, Publish Date - Jul 15 , 2025 | 05:46 AM
వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా రాధాకృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘జూనియర్’. శ్రీలీల హీరోయిన్. రజనీ కొర్రపాటి నిర్మించారు...
వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా రాధాకృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘జూనియర్’. శ్రీలీల హీరోయిన్. రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ నెల 18న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘కిరీటి రూపంలో పరిశ్రమకు మరో ప్రామిసింగ్ హీరో దొరికాడు. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బాగుంది. సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘కిరీటికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఇష్టం. నా తనయుడిపై అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’’ అని గాలి జనార్థన్ రెడ్డి అన్నారు. ‘‘ఇంత మంచి సినిమాతో లాంఛ్ కావడం ఆనందంగా ఉంది. విజువల్‌గా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని కిరీటి రెడ్డి చెప్పారు.