Kiran Abbavaram: గ్యాప్ ఇవ్వు అన్నా.. ఇప్పుడేగా హిట్ కొట్టింది.. అప్పుడే ఇంకొకటా
ABN, Publish Date - Oct 20 , 2025 | 02:53 PM
కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విజయాపజయాలను పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు.
Kiran Abbavaram: కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విజయాపజయాలను పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. మంచి మంచి కథలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను మెప్పించే విధంగా బాగా కష్టపడుతున్నాడు. ఒక సినిమా ప్లాప్ అయినా.. ఇంకో సినిమాతో విజయాన్ని అందుకుంటున్నాడు. ఈ ఏడాది దిల్ రుబాతో వచ్చి ప్లాప్ అందుకున్నా.. కె ర్యాంప్ తో మంచి హిట్ కొట్టాడు. శనివారం రిలీజ్ అయిన కె ర్యాంప్.. సోమవారం కూడా ఫుల్ రష్ తో కొనసాగుతుంది.
కె ర్యాంప్ రెండు రోజులకే 11.3 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. కిరణ్ వన్ మ్యాన్ షో, కామెడీ బాగా పండడం వలన.. అది కాకా ఇంకే సినిమాలు లేకపోవడంతో కె ర్యాంప్ కు దీపావళీ పండగ కలిసొచ్చింది. ఈ సినిమా ఇంకా రిలీజ్ అయ్యి వారం కూడా కాకముందే కిరణ్ మరో సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు. అయితే ఈసారి కిరణ్.. నిర్మాతగా కూడా మారాడు. నేడు దివాళీ పండగ సందర్భంగా తన కొత్త సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపాడు.
కిరణ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. మునిరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ లో వెంకటేశ్వర స్వామి కట్ అవుట్ ఎదురుగా నిలబడి కిరణ్ అలా పైకి చూస్తూ కనిపించాడు. లుక్ చూస్తుంటే ఇదేదో 80 వ దశకంలో జరిగే కథలా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక కిరణ్ స్పీడ్ చూసి గ్యాప్ ఇవ్వు అన్నా.. ఇప్పుడేగా హిట్ కొట్టింది.. అప్పుడే ఇంకొకటా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సినిమాతో కిరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Ram Pothineni: రామ్ చరణ్ ని చూసి జాలేసింది
Alia Bhatt: ఆలియా భట్ ఇంట్లో.. దీపావళి సెలబ్రేషన్స్!