Jigris: మొన్న సందీప్ రెడ్డి.. నేడు కిరణ్ అబ్బవరం.. చిన్న సినిమాకు అండగా
ABN , Publish Date - Aug 29 , 2025 | 10:08 PM
కొత్త టాలెంట్ ను టాలీవుడ్ ఎప్పుడు నిరాశపర్చదు. ఇక మన హీరోలు కానీ, డైరెక్టర్స్ కానీ.. ఎప్పుడు కొత్తవారిని ఆదరిస్తూనే ఉంటారు.
Jigris: కొత్త టాలెంట్ ను టాలీవుడ్ ఎప్పుడు నిరాశపర్చదు. ఇక మన హీరోలు కానీ, డైరెక్టర్స్ కానీ.. ఎప్పుడు కొత్తవారిని ఆదరిస్తూనే ఉంటారు. మంచి కథలను ఎంకరేజ్ చేయడంలో టాలీవుడ్ ఎప్పుడు ముందే ఉంటుంది. కృష్ణ బురుగుల, రామ్ నితిన్, మణి వక, ధీరజ్ ఆత్రేయ కీలక పాత్రల్లో నటించిన చిత్రం జిగ్రీస్(Jigris). హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక మొన్ననే ఈ సినిమా టీజర్ ను సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.
జిగ్రీస్ టీజర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం సినిమాలోని సాంగ్స్ ను రిలీజ్ చేస్తుంది. జిగ్రీస్ చిత్రం నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను కుర్ర హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. K- ర్యాంప్ సినిమా సెట్ లో షూటింగ్ ఆపి మరీ ఈ సాంగ్ ను కిరణ్ రిలీజ్ చేశాడు.
తిరిగే భూమి అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ జిగ్రీస్. వారందరూ కారులో రోడ్ ట్రిప్ కు వెళ్తునప్పుడు వచ్చే సాంగ్ లా కనిపిస్తుంది. జీవితం, ప్రకృతి, స్నేహం.. ఇలా లిరిక్స్ లో ప్రతి పదం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ సాంగ్ కు డైరెక్టరే లిరిక్స్ అందించడం విశేషం. కమ్రాన్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సాంగ్ ను ఏక్‌నాథ్, జునైద్, సుధాన్ష్ తమ వాయిస్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఈ నగరానికి ఏమైంది, మ్యాడ్ సినిమాలను జిగ్రీస్ గుర్తుచేస్తుంది. మరి ఈ సినిమాతో ఈ నలుగురు కుర్రాళ్లు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
OG Movie: ఏం హైప్ రా మావా.. ఓజీలో టిల్లు రాధిక ఐటెం సాంగ్
Sunny Leone: నా పిల్లల్ని నేను కనలేదు.. ఆమెకు చాలా డబ్బులిచ్చి ..