సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kiran Abbavaram: కె-ర్యాంప్ ఒక్క సినిమా.. 16 ముద్దులు! అంతా కిస్సుల మ‌యం

ABN, Publish Date - Oct 10 , 2025 | 05:05 PM

కిరణ్‌ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటిస్తున్న 'కె-ర్యాంప్' మూవీ అక్టోబర్ 17న విడుదల కాబోతోంది. దీపావళి కానుకగా వస్తున్న ఈ సినిమా దాదాపు 16 కిస్సింగ్స్ సీన్స్ ఉన్నాయట. మరి ఈ సినిమాకు సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ జారీ చేస్తారో చూడాలి.

అప్పట్లో ఏమిటీ ఇప్పుడు కూడా కమల్ హాసన్ సినిమా అంటే లిప్ లాక్ సీన్ కంపల్సరీ. కిస్సింగ్ సీన్స్ లేని కమల్ హాసన్ సినిమాను జనాలు ఊహించుకోలేరు. ఏడు పదులు దాటినా కమల్ హాసన్ సినిమాల్లో లిప్ టు లిప్ కిస్ సీన్స్ తప్పనిసరి. అందుకు అంగీకరించే హీరోయిన్లు ఆయన సరసన నటిస్తూ ఉంటారు.


తెలుగులోనూ ఈ మధ్య కాలంలో లిప్ లాక్ సీన్స్ ఎక్కువయ్యాయి. అయితే దీపావళి కానుకగా రాబోతున్న కిరణ్‌ అబ్బవరం 'కె-ర్యాంప్'లో అయితే ఏకంగా 16 కిస్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. హీరోయిన్లను ఫ్లట్ చేసే క్రమంలో హీరోలు లిప్ లాక్ చేయడం అనేది ఇవాళ సినిమాల్లో కామన్ థింగ్ అయిపోయింది. సినిమా మొత్తంలో ఒకటి రెండు చోట్ల లిప్ లాక్ సీన్ పెట్టినా సెన్సార్ వాళ్ళు సైతం పెద్దంతగా అభ్యంతరం పెట్టడం లేదు. సీన్ డిమాండ్ చేసిందనే భావనతో సర్దుకు పోతున్నారు. అయితే... 'కె-ర్యాంప్'లో ఏకంగా 16 లిప్ లాక్ సీన్స్ ఉన్నాయంటే... హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్ యుక్తి తరేజా మధ్య లవ్ మేకింగ్, రొమాంటిక్ సీన్స్ ఎన్ని ఉండి ఉంటాయో ఊహించుకోవచ్చు. పైగా ఈ సినిమా ట్రైలర్ ను చూసిన ఎవరికైనా... కిరణ్‌ అబ్బవరం హద్దులన్నీ చెరిపేసి హాయిగా రెచ్చిపోయాడనే విషయం కూడా అర్థమౌతుంది.


అయితే... పండగ పూట వస్తున్న 'కె-ర్యాంప్'లో మరీ అన్ని ముద్దు సీన్స్ ఉంటే ఫ్యామిలీ ఆడియెన్స్ కొంత ఇబ్బంది పడతారనే విషయాన్ని మేకర్స్ అర్థం చేసుకుని కొన్నింటిని ట్రిమ్ చేశారని, కొన్ని చోట్ల తొలగించారని అంటున్నారు. ఏదేమైనా రేపు సెన్సార్ కార్యక్రమాలు జరిగిన తర్వాత కానీ ఈ సినిమాలో ముద్దులు ఏమేరకు ఉన్నాయో, ఎంత తీవ్రంగా ఉన్నాయో కానీ అర్థం కాదు. బాలీవుడ్ లో ఇమ్రాన్ హష్మీని ముద్దుల హీరో అని ముద్దుగా పిలుచుకునే వారు. మరి 'కె-ర్యాంప్' తర్వాత ఆ టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ అని కిరణ్ అబ్బవరంకు బిరుదు ఇచ్చేస్తారేమో చూడాలి.

Also Read: The Raja Saab: గ్రీస్ లో రెబల్ స్టార్ ప్రభాస్...

Also Read: They Call Him OG: సువ్వి సువ్వి సువ్వాలా.. వీడియో సాంగ్ వచ్చేసింది

Updated Date - Oct 10 , 2025 | 06:33 PM