K Ramp: కలెక్షన్స్ చెప్పుకుంటే.. డప్పు కొట్టినట్లు ఉంటుంది
ABN, Publish Date - Oct 19 , 2025 | 03:12 PM
'ఈ మధ్య కాలంతో చాలా మంది ప్రేక్షకులు చేతిలో ఫోన్ లేకుండా సినిమా చూడటం లేదు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు.
'ఈ మధ్య కాలంతో చాలా మంది ప్రేక్షకులు చేతిలో ఫోన్ లేకుండా సినిమా చూడటం లేదు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. ఫోన్ పక్కన పడేసి 'K ramp' సినిమాని ఎంజాయ్ చేయడం థియేటర్లో గమనించా. ఇది మేమి సాధించిన సక్సెస్ గా భావిస్తున్నాం' అని దర్శకుడు జైన్స్ నాని అన్నారు. కిరణ్ అబ్బవరం(kiran Abbavaram), యుక్తి తరేజా జంటగా నటించారు. దీపావళి సక్సెస్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ కిరణ్ అబ్బవరం 'K-ర్యాంప్' తో హిట్ కొట్టాడు. ఈ సందర్భంగా శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ 'దీపావళికి నాకు మళ్లీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఊర్లు, టౌన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మార్నింగ్ షో చూసిన మీడియా నుంచి ఇన్ని కాల్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకు వెళ్తున్నారు. షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఇంత మంచి కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. పండక్కి మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలి, చిన్న మెసేజ్ ఇవ్వాలి, ఒక వైబ్ మూవీలో ఉండాలని చేసిన ప్రయత్నమిది' అన్నారు.
నిర్మాత రాజేశ్ దండ మాట్లాడుతూ 'K-ర్యాంప్' సినిమాను కేవలం నవ్వించడం కోసమే తీశామని మేము చెబుతున్నాం. ఇలాంటి సినిమాలో లాజిక్స్ వెతకకూడదని చెప్పం. కానీ కొందరు కావాలనే సినిమాను కిల్ చేయాలనుకుంటున్నారు. కొందరు ఇచ్చిన రేటింగ్స్ చూసి బాధనిపించింది. కావాలనే మా మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు. ట్విట్టర్ రివ్యూస్ లో ఫుల్ రివ్యూ కు మధ్యలో గంటలు గంటలు గ్యాప్ ఇస్తారు. రేటింగ్ సాయంత్రానికి ఇస్తారు. చిన్న ప్రొడ్యూసర్ కదా అని తక్కువగా చూస్తున్నారు. దీపావళికి రిలీజైన సినిమాల్లో ఏ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసి నిజాలు తెలుసుకోవాలి. హైదరాబాద్ లో చాలా థియేటర్స్ లో షోస్ ఫుల్ అవుతున్నాయి. అలాగే వైజాగ్, ఈస్ట్ లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఆ కలెక్షన్స్ అన్నీ నేనే చెప్పుకుంటే డప్పు కొట్టినట్లు ఉంటుంది' అన్నారు
జైన్స్ నాని మాట్లాడుతూ 'హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ ను హైలైట్ గా పెట్టుకుని ఫెస్టివల్ కు ఎంజాయ్ చేసే మంచి ఫన్, ఎంటర్టైన్మెంట్ సినిమా తీసాం. మా ప్రొడ్యూసర్ అన్నట్లు రివ్యూస్ లో వచ్చిన విశ్లేషణ చూసి నేనూ బాధపడ్డాను. కొత్త దర్శకుడిగా నిరాశ చెందాను. శ్రీరాములు థియేటర్ లో సినిమా చూస్తుంటే ప్రేక్షకులు ఫస్టాఫ్ ను బాగా ఎంజాయ్ చేశారు. సెకండాఫ్ లో సెంటిమెంట్ కు కనెక్ట్ అవుతున్నారు. ఫోన్స్ పక్కనపెట్టి సినిమా చూస్తున్నారు. ప్రేక్షకుల దగ్గర నుంచి మా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ కు రివ్యూస్ కు సంబంధం లేదు. మీడియా మిత్రులు కూడా చాలా మంది సినిమా చూస్తూ నవ్వుకున్నామని చెప్పారు. కిరణ్ గారు సినిమాను భుజాల మీద వేసుకుని మోశారు కాబట్టి ఈ రోజు ఇలాంటి మంచి రిజల్ట్ వచ్చింది' అన్నారు.
నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ 'ఇది కిరణ్ అబ్బవరం ర్యాంప్. నా క్యారెక్టర్ కు హిలేరియస్ రెస్పాన్స్ వస్తోంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. సొసైటీలో చూస్తున్న కొందరిని రిఫ్లెక్ట్ చేసేలా క్యారెక్టర్స్, డైలాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ నవ్వించడం కోసం చేసిన ప్రయత్నమే. దర్శకుడు కథ చెప్పినప్పుడే ఈ సినిమా హిట్ అని అన్నాను. అతను నెక్ట్స్ లెవెల్ డైరెక్టర్ అవుతాడని చెప్పాను' అన్నారు.