K Ramp Glimpse: కె ర్యాంప్ గ్లింప్స్.. కిరణ్ సినిమాలో ఇన్ని బూతులా
ABN, Publish Date - Jul 14 , 2025 | 04:33 PM
కాలం మారేకొద్దీ ప్రేక్షకులు కూడా మారుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ బూతులు ఉంటేనే అంత ఎక్కువ హిట్ అవుతున్నాయి అని అనుకుంటున్నారో ఏమో.. ప్రతి సినిమాలో బూతులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఆ లిస్ట్ లోకి కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కూడా చేరిపోయాడు.
K - Ramp Glimpse: కాలం మారేకొద్దీ ప్రేక్షకులు కూడా మారుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ బూతులు ఉంటేనే అంత ఎక్కువ హిట్ అవుతున్నాయి అని అనుకుంటున్నారో ఏమో.. ప్రతి సినిమాలో బూతులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఆ లిస్ట్ లోకి కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కూడా చేరిపోయాడు. రాజావారు రాణిగారు సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన కిరణ్.. ఇప్పటివరకు చాలా డీసెంట్ గా సినిమాలు చేస్తూ వచ్చాడు. విజయాపజయాలను పక్కనపెడితే కిరణ్ సినిమాల్లో బూతులు కానీ, అశ్లీల సన్నివేశాలు.. చివరకు హీరోహీరోయిన్ల మధ్య ఘాటు సన్నివేశాలు కూడా ఉండవు. కానీ, ఈసారి మాత్రం కిరణ్ కూడా తన పంథా మార్చేశాడు.
తాజాగా కిరణ్ అబ్బవరం నటిస్తున్న చిత్రాల్లో కె ర్యాంప్ ఒకటి. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కిరణ్ సరసన యుక్తి తరేజా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. క సినిమా తరువాత నుంచి కిరణ్ పై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకుంటున్నారు. నేడు కిరణ్ పుట్టినరోజు కావడంతో కె ర్యాంప్ నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చారు మేకర్స్.
కె ర్యాంప్ గ్లింప్స్ మొత్తాన్ని బూతులతో నింపేశాడు డైరెక్టర్. 'ఈసారి ఒక్కొక్కడికి బుర్రపాడు.. బుడ్డలు జారుడే' అనే డైలాగ్ తో మొదలైన గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. గ్లింప్స్ లో బూతు పదాలు మాట్లాడుతూ కిరణ్ కనిపించాడు. కుమార్ లైఫ్ ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు.. ప్రతిసారి కిరణ్ బూతుమాటను మింగేయడం.. బార్ లో తాగుతూ ఫైట్ చేయడం లాంటి సీన్స్ ను చూపించారు. ఇక ఈ వీడియోలో సగానికి పైగా మలయాళ భాషలో హీరో మాట్లాడడం చూపించడంతో.. హీరోయిన్ మలయాళీ అని తెలుస్తోంది. ఇక చివర్లో మలయాళ లవ్ స్టోరిలపై కిరణ్ కౌంటర్ వేశాడు.
'ఏఎంబీ సినిమాల్లో మన మలయాళ సినిమాలు చూసి హిట్ చేస్తాం.. కానీ, తెలుగు ప్రేమకథలతోనే మనకు ప్రాబ్లెమ్. ఎందుకంటే వాళ్లదాంట్లో ఉన్న ఆ ఎండ్ సిటీ మనదాంట్లో ఉండదు.. మనిద్దరి ప్రేమ గు*సిపోయినా పర్లా.. ప్రేమ మాత్రం బావుండాలి' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచించి. కిరణ్ నోటి నుంచి ఇన్ని బూతులు వినడం ఇదే మొదటిసారి అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది బూతుల వలన సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నావా..? అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ కిరణ్ అబ్బవరంకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.