సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kingdom: కింగ్డమ్‌ కలెక్షన్స్‌ ఎంతో తెలుసా..

ABN, Publish Date - Aug 01 , 2025 | 04:00 PM

విజయ్‌ దేవరకొండ (vijay Devarakonda) కొన్నాళ్లగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యన ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద చతికిలబడ్డాయి.


విజయ్‌ దేవరకొండ (vijay Devarakonda) కొన్నాళ్లగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యన ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద చతికిలబడ్డాయి. తాజాగా ఆయన ‘కింగ్డమ్‌’తో (kingdom) ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇందులో తన నటనతో ఆకట్టుకున్నారు విజయ్‌. మార్నింగ్‌ షోకు మిశ్రమ స్పందనకు పరిమితమైనీ చిత్రం ఈవెనింగ్‌ షోకు మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా వసూళ్లను నిర్మాణ సంస్థ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటిరోజు రూ.39 కోట్లు (గ్రాస్‌) కలెక్ట్‌ చేసినట్టు చెబుతూ ‘ఈ రాజు తన రాకతో బీభత్సం సృష్టించాడంటూ’ పోస్టర్‌ విడుదల చేశారు. దీనికి విజయ్‌ దేవరకొండ రియాక్ట్‌ అయ్యారు. (Kingdom Collections)

‘మనం కొట్టినం’ అని క్యాప్షన్‌ పెట్టారు. వీకెండ్‌లో విడుదల కాకపోయినా సినిమాకు చక్కని వసూళ్లు వచ్చాయని, ఇలా జరగడం చాలా అరుదు అని పేర్కొన్నారు. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు, మొదటిరోజు రూ.2.6 కోట్లకు పైనే వసూలైందని నిర్మాత నాగవంశీ తెలిపారు. విజయ్‌ దేవరకొండ, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో, అన్నదమ్ముల చుట్టూ తిరిగే కథగా గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమా తెరకెక్కించారు. భాగ్యశ్రీ కథానాయికగా నటించారు.

Updated Date - Aug 01 , 2025 | 04:00 PM