మీనాకుమారి బయోపిక్‌లో కియార
ABN, Publish Date - Jun 25 , 2025 | 05:36 AM
మహానటి సావిత్రికి, బాలీవుడ్ నటి మీనాకుమారికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి.. ఇద్దరూ కోట్లాది మంది ప్రేక్షకుల్ని అలరించారు. వేలాది మంది యువ కథానాయికలకు...
మహానటి సావిత్రికి, బాలీవుడ్ నటి మీనాకుమారికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి.. ఇద్దరూ కోట్లాది మంది ప్రేక్షకుల్ని అలరించారు. వేలాది మంది యువ కథానాయికలకు ఆదర్శంగా నిలిచారు. అయితే వ్యక్తిగత జీవితంలో చేసిన కొన్ని తప్పుల వల్ల భారీ మూల్యం చెల్లించి చిన్న వయసులోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెలుగులో ‘మహానటి’ చిత్రం వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్లో మీనాకుమారి జీవిత కథను సినిమాగా మలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బైజు బవ్రా, పరిణీత, కాజల్, పాకీజా వంటి చిత్రాల్లో నటించి ‘ట్రాజెడీ క్వీన్’గా పేరొందిన మీనాకుమారి ప్రేమ వ్యవహారం కారణంగా జీవితంపై అదుపు కోల్పోయి తన 38వ ఏటే మరణించారు. ఇప్పుడు ఆవిడ కథను ‘కమల్ ఔర్ మీనా’ పేరుతో అమ్రోహి కుటుంబంతో కలసి సరెగమ సంస్థ సినిమాగా తీస్తోంది. మీనాకుమారి భర్త, దర్శకుడు కమల్ అమ్రోహి ఆశీస్సులతో ఈ చిత్రం తయారు కానుంది.
ఇందులో మీనాకుమారి పాత్రను ఎవరు పోషిస్తున్నదీ ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినా కియార ఆడ్వాణీ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న కియారకు ఈ కథ బాగా నచ్చడంతో డెలీవరీ అయ్యాక ఈ చిత్రంలో నటిస్తారని చెబుతున్నారు. అయితే దర్శకుడు సిద్ధార్థ్ మల్హోత్రా మాత్రం ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోందనీ, నటీనటుల గురించి ఇంకా ఆలోచించలేదని చెబుతున్నారు.