HariHara Veeramallu: రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన పవన్.. కారణం అదే.. ?
ABN , Publish Date - Jun 04 , 2025 | 03:39 PM
ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు(HariHara Veeramallu) ఒకటి. డైరెక్టర్ క్రిష్(Director Krish) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాను ఏఎం రత్నం(AM Rathnam)ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గొప్ప మనసు చాటుకున్నాడు. సినిమా రిలీజ్ కాకపోవడం వలన నిర్మాతకు అదనపు భారంగా మారిందని ఆయన తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేశాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు(HariHara Veeramallu) ఒకటి. డైరెక్టర్ క్రిష్(Director Krish) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాను ఏఎం రత్నం(AM Rathnam)ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.
పవన్.. రాజకీయాల్లోకి వచ్చాకా సినిమాలను వదిలేస్తాను అని ప్రకటించాడు. ఆ తరువాత పార్టీ ఫండ్ కోసం సినిమాలు చేయక తప్పడం లేదని.. మేకర్స్ వద్ద అడ్వాన్స్ తీసుకొని,. ఆ డబ్బుతోనే జనసేన పార్టీని నడిపించాడు. అలా పవన్ కు అడ్వాన్స్ ఇచ్చినవారిలో ఏఎం రత్నం కూడా ఒకరు. పవన్ గెలిచేంతవరకు కూడా వీరమల్లు షూటింగ్ కు ఎప్పుడు వస్తే అప్పుడే చేశారు కానీ, కంగారు పెట్టలేదు. అందుకే పవన్ కూడా రత్నంను ఎంతో గౌరవించాడు. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారమే సమయం దొరికినప్పుడల్లా షూటింగ్ చేస్తూ ఎట్టకేలకు వీరమల్లును పూర్తిచేశాడు.
Also Read: Thug Life: కమల్ క్షమాపణ చెప్పకపోతే జరిగేది ఇదే.. ?
దాదాపు ఐదేళ్లగా ఈ సినిమా రిలీజ్ కోసం కష్టాలు పడుతూనే ఉంది. ఏఎం రత్నం.. ఇన్నేళ్లు అయినా వీరమల్లును వదలకుండా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. సీజీ వర్క్ అని, రీషూట్స్ అని, లొకేషన్స్ అని.. ఇలా డబ్బులు ఖర్చుపెడుతూనే వస్తున్నాడు. ఇవన్నీ కాకుండా సినిమా రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు గొడవ.. ఇవన్నీ భరిస్తూ చివరకు జూన్ 12 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ డేట్ కూడా కన్ఫర్మ్ అని చెప్పలేం.
ఇక ఎన్నాళ్లని నిర్మాతకు అదనపు భారాన్ని అందించాలని పవన్ తాజాగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. సినిమాకు ముందు తాను తీసుకున్న అడ్వాన్స్ ను ఏఎం రత్నంకు తిరిగి ఇచ్చేశాడు. ఆ లెక్కన వీరుమల్లు కోసం పవన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఏదిఏమైనా పవన్ తీసుకున్న నిర్ణయం మంచిదే కానీ, అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అయితే మరీ మంచిది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి జూన్ 12 న వీరమల్లు వస్తాడా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.