సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi: ‘వారణాసి’ మ్యూజికల్‌ అప్‌డేట్‌ వదిలిన కీరవాణి

ABN, Publish Date - Nov 22 , 2025 | 09:54 AM

యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న వారణాసి సినిమాకు సంబంధించి ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్‌ అవుతోంది. తాజాగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మ్యూజికల్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

ప్రస్తుతం ఎక్కడ చూసిన మహేశ్‌(Mahesh), రాజమౌళి (SS rajamouli)కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ (Varanasi) చిత్రం గురించే చర్చ. దాంతోపాటు గ్లోబ్‌ ట్రోటర్‌ ఈవెంట్‌లో హనుమాన్‌పై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్‌ అయ్యాయి. యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్‌ అవుతోంది. తాజాగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మ్యూజికల్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. గోవా వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) వేడుకలకు కీరవాణి (MM Keeravani) హాజరయ్యారు. ఈ చిత్రంలో సంగీతం ఎవరూ ఊహించని  రేంజ్‌లో ఉంటుందని ఆయన అన్నారు.


‘ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఈ సినిమాలో అద్భుతమైన సంగీతాన్ని వింటారు. ఆ ప్రొసెస్‌ అంతా గొప్ప అనుభూతి కలిగింది. అంతకుమించి సినిమాకు సంబంధించి మరేం చెప్పలేను. ఇందులో మొత్తం ఆరు పాటలుంటాయి. మనం చేసే పని ఏదేనా దానిపై స్పష్టత, మనపై మనకు నమ్మకం ఉంటే ఏ విషయమూ గజిబిజిగా ఉండదు.  ఒత్తిడి దరి చేరదు. నాకు ఈ ప్రాజెక్ట్‌ విషయంలో ఎలాంటి గందరగోళం లేదు’ అని అన్నారు.
 

Updated Date - Nov 22 , 2025 | 10:00 AM