సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mithra Mandali: నాయాల్ది.. క‌త్తందుకో జాన‌కి లిరిక‌ల్ వీడియో

ABN, Publish Date - Jun 22 , 2025 | 09:48 AM

మిత్ర మండ‌లి మూవీ నుంచి క‌త్తందుకో జాన‌కి అంటూ సాగే పాట‌ను మేక‌ర్స్‌ రిలీజ్ చేశారు.

mithramandali

చాలా కాలంగా గీతా ఆర్ట్స్‌2 వ్య‌వ‌హారాలు చూసుకుంటున్న బ‌న్నీ వాస్ (Bunnyvas) స‌డ‌న్‌గా కొత్త‌గా బీవీ వర్క్స్ (BV Works) పేరిట కొత్త బ్యాన‌ర్ స్థాపించి సప్త అశ్వ క్రియేటివ్స్ (SaptaAswaCreatives) , వైరా ఎంటర్టైన్మెంట్స్ (Vyra Entertainments) సంస్థ‌ల‌తో క‌లిసి సంయిక్త‌గా రూపొందిస్తున్న సినిమా మిత్ర మండ‌లి (Mithra Mandali). ప్రియ ద‌ర్శి (Priyadarshi Pulikonda), రాగ్ మ‌యూర్ (Rag Mayur), ప్ర‌సాద్ బెహ‌రా (Prasad Behra), విష్ణు (Vishnu) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా ఇన్ ఫ్లూయెన్స‌ర్ నిహారిక (Niharika Nm) టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. విజయేంద‌ర్‌ ఎస్ (VijayendarS) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత.

ఇప్ప‌టికే రిలీజ్ చేసిన (Mithra Mandali Teaser) టీజ‌ర్ సినిమాపై మంచి హైప్స్ తీసుకు రాగా తాజాగా ఈ మూవీ నుంచి క‌త్తందుకో జాన‌కి (Kattanduko Janaki) అంటూ సాగే పాట‌ను రిలీజ్ చేశారు. ఆర్.ఆర్. ధృవన్ (|RR Dhruvan) సంగీతం అందించిన ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ సాహిత్యం అందించ‌గా రాహుల్ సిప్లీగంజ్ (Rahul Sipligunj) ఆల‌పించారు. సినిమాలో న‌లుగురు మిత్రుల‌పై చిత్రీక‌రించారు. కుర్రాళ్లు త‌మ దైనందిన కార్య‌క్ర‌మాల‌ను చెప్ప‌డం ఆపై క‌త్త‌దంఉకో జాన‌కీ అంటూ త‌ల్లిదండ్రుల పాత్ర‌లు రియాక్ట్ అయ్యే నేప‌థ్యంలో పాట సాగుతూ ఆద్యంతం అల‌రించేలా ఉంది.

Updated Date - Jun 23 , 2025 | 12:45 PM