JR Ntr: ఆ పాత్రకు తారక్.. ఇక మామూలుగా ఉండదు
ABN , Publish Date - Jun 12 , 2025 | 10:58 AM
'యమదొంగ’ సినిమాలో కాసేపు యంగ్ యమాగా కనిపించి థియేటర్ దద్దరిల్లేలా చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అది జస్ట్ కామియో లాంటి పాత్రే. అయితే అప్పటి నుంచి తారక్‌ను అలాంటి పౌరాణిక పాత్రలో పూర్తి స్థాయిలో చూడాలనుకుంటున్నా అభిమానులు.
'యమదొంగ’ సినిమాలో కాసేపు యంగ్ యమాగా కనిపించి థియేటర్ దద్దరిల్లేలా చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) . అది జస్ట్ కామియో లాంటి పాత్రే. అయితే అప్పటి నుంచి తారక్‌ను అలాంటి పౌరాణిక పాత్రలో పూర్తి స్థాయిలో చూడాలనుకుంటున్నా అభిమానులు. ఇప్పుడు ఆ తరహా పాత్ర తారక్ చెంతకు చేరిందని, పురాణాలతో ముడిపడిన ఓ కథలో తారక్ నటించబోతున్నారని ఓ వార్తల వైరల్ అవుతోంది. ఆ వార్తలు నిజమేనని కూడా తెలుస్తోంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) ఎక్స్‌లో పోస్ట్ చేసిన పోస్ట్ కూడా అందుకు బలాన్ని చేకూరుస్తోంది. మాటల మాత్రికుడు త్రివిక్రమ్ ఎప్పట్నుంచో పురాణాలతో కూడిన కథ తయారు చేస్తున్నారు. దీనిని మొదట అల్లు అర్జున్‌తో (Allu arjun) తీయాలనుకున్నారు. అయితే అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్‌తో బిజీ అయిపోయారు. దాంతో ఇదే కథను ఎన్టీఆర్‌తో తీసేందుకు త్రివిక్రమ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఒప్పుకున్న సినిమాలు త్రివిక్రమ్ (trivikram) చేతిలో ఉన్న సినిమా పూర్తయిన తర్వాత... ఆ ఇద్దరూ కలిసి ఈ సినిమా తీసే అవకాశం ఉంది. అయితే ఇందులో తారక్ కార్తికేయుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘నాకు అత్యంత ఇష్టమైన అన్న... అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరిగా కనిపిస్తారు’ అ’ంటూ షణ్ముక శ్లోకాన్ని ట్వీట్ చేశారు నిర్మాత నాగవంశీ. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబో సినిమా గురించే నాగవంశీ ఈ పోస్ట్ పెట్టారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
అయితే ఈ కథ చేరాల్సిన చోటుకే చేరిందనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు బన్నీతో చేయాల్సిన సినిమా ఇది. ఫైనల్‌గా తారక్ చెంతకు చేరింది. బన్నీ డేట్స్ కోసం త్రివిక్రమ్ ఎదురు చూశారు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్-బన్నీ అనౌన్స్‌మెంట్ వస్తుందని అనుకున్నారు. కానీ బన్నీ అట్లీ సినిమాకు సై అన్నారు. వెయిటింగ్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఈ కథ తారక్ వైపు టర్న్ చేశారు త్రివిక్రమ్. అయితే ఇది తారక్‌కే కరెక్ట్‌గా సరిపోయే కథ అని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడీ సినిమా అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Tollywood: మంచి నిర్మాత మహేంద్ర మరిలేరు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి