సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vilaya Thandavam:‘విలయ తాండవం’ కంటెంట్ ఉన్న సినిమా 

ABN, Publish Date - Oct 02 , 2025 | 11:24 PM

కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో  తెరకెక్కుతున్న చిత్రం ‘విలయ తాండవం’. వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. 

కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో  తెరకెక్కుతున్న చిత్రం ‘విలయ తాండవం’. జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై  మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు నిర్మిస్తున్నారు. వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు పోస్టర్ విడుదల చేశారు. 

ఆకాష్ పూరి మాట్లాడుతూ ‘విలయ తాండవం’ టైటిల్ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంది. పోస్టర్‌ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. కార్తీక్ రాజుకి మరోసారి ఈ చిత్రంతో మంచి పేరు రావాలని, సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


కార్తిక్ రాజు మాట్లాడుతూ  ‘ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలనే జనాలు ఆదరిస్తున్నారు. మంచి కాన్సెప్ట్ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. డైరెక్టర్ వాసు సరికొత్త పాయింట్, కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ వచ్చాక అందరూ ఆశ్చర్యపోతారు' అని అన్నారు.

నిర్మాత మందల ధర్మా రావు మాట్లాడుతూ 'త్వరలోనే మరిన్ని అప్డేట్లతో ఆడియెన్స్ ముందుకు వస్తామ’ని అన్నారు.

దర్శకుడు వీఎస్ వాసు మాట్లాడుతూ .. ‘మా స్నేహితుడు సంజయ్ వల్లే ఈ మూవీ ప్రయాణం మొదలైంది. నాకు అండగా నిలిచి అవకాశం ఇచ్చిన నా నిర్మాతలకు థాంక్స్. మా కోసం ఈ రోజు ఇక్కడకు వచ్చిన గౌర హరి, ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు గార్లకు థాంక్స్. ‘విలయ తాండవం’ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన కార్తీక్ రాజుకి థాంక్స్. త్వరలోనే మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రానుంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

Updated Date - Oct 02 , 2025 | 11:25 PM