Prabhas: కరీనా ఐటెంసాంగ్.. థియేటర్లు ఉండడానికేనా
ABN , Publish Date - Jun 30 , 2025 | 07:46 PM
ది రాజాసాబ్ (The Rajasaab) టీమ్ ఈసారి ఫ్యాన్స్ ను హైప్ తోనే చంపేసాలానే ఉంది. ఒకదాని తరువాత ఒకటి సర్ప్రైజ్ లు ఇస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టి పిచ్చెక్కిస్తుంది.
Prabhas: ది రాజాసాబ్ (The Rajasaab) టీమ్ ఈసారి ఫ్యాన్స్ ను హైప్ తోనే చంపేసాలానే ఉంది. ఒకదాని తరువాత ఒకటి సర్ప్రైజ్ లు ఇస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టి పిచ్చెక్కిస్తుంది. యాక్షన్ సినిమాలతో విసుగెత్తిపోయిన ప్రభాస్ కొద్దిగా ఛేంజ్ కోసం కామెడీ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అయిన ది రాజాసాబ్ ను ఎంచుకున్నాడు. మారుతీ (Maruthi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు భామలను దింపాడు మారుతీ.
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఈసారి ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రభాస్ లుక్ చూసి.. ఫ్యాన్స్ అందరూ మారుతీకి గుడి కట్టినా తప్పులేదురా అనేంతగా ఇంప్రెస్స్ అయ్యారు. ఇక డార్లింగ్ కామెడీ టైమింగ్, ముద్దుగుమ్మలతో రొమాన్స్.. ఇలా సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ లు చూపించారు.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం వీటన్నింటికి మించిన సర్ప్రైజ్ ఇంకొకటి ఉందని వార్తలు వస్తున్నాయి. రాజాసాబ్ లో ఒక ఐటెంసాంగ్ ఉందని ఎప్పుడో టాక్ నడిచింది. కానీ, మధ్యలో రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ లో కొంత సమయం, టీజర్ రిలీజ్ అయ్యాక ఆ ఆనందంలో కొంత సమయం గడిచిపోయాయి. ఇక ఇప్పుడు మరోసారి రాజాసాబ్ ఐటెంసాంగ్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. ప్రభాస్ ఐటెంసాంగ్ లో డ్యాన్స్ చేస్తున్నాడు అనేదే పెద్ద సర్ప్రైజ్ అయితే.. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ను తీసుకొనే ప్రయత్నాలు సాగుతున్నాయనే వార్త ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుంది.
రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో ఒక సన్గ్ ఉందని మేకర్స్ అధికారికంగానే ప్రకటించారు. అది కాకుండా ఒక ఐటెంసాంగ్ ఉండబోతుందని, అది కేవలం ఫ్యాన్స్ కోసం.. ప్రభాస్ మాత్రమే కనిపిస్తాడని అంటున్నారు. ఇక ఈ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్లను వెతికివెతికి చివరకు కరీనా వద్ద ఆగారని, త్వరలోనే ఈ సాంగ్ షూట్ మొదలుకానుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ సాంగ్ థియేటర్ లో ఒక్క ప్రేక్షకుడు కూడా సీట్ లో కూర్చోడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్.. థియేటర్స్ ఉండవు.. తగలెట్టేయడమే ఇక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకులు.. ధైర్యం ఉంటే నా ముఖం మీద అనండి