Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకులు.. ధైర్యం ఉంటే నా ముఖం మీద అనండి
ABN , Publish Date - Jun 30 , 2025 | 05:46 PM
ఇండస్ట్రీలో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి పైకి వచ్చినవారు కొందరు అయితే.. నెపో కిడ్స్ గా పరిచయం అయినవారు మరికొందరు.
Abhishek Bachchan: ఇండస్ట్రీలో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి పైకి వచ్చినవారు కొందరు అయితే.. నెపో కిడ్స్ గా పరిచయం అయినవారు మరికొందరు. అయితే వారసులు అనేవారికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రమే ఈజీ. ఆ తరువాత తమను తాము నిరూపించుకోకపోతే ట్రోలింగ్ కు గురవుతూనే ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) పరిస్థితి కూడా అదే. బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amithabh Bachchan) నట వారసుడిగా అభిషేక్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అమితాబ్ కొడుకు అనగానే మొదట్లో చాలా అంచనాలు ఉండేవి. కానీ, అభిషేక్ ఎందుకో ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి.
అప్పటి నుంచి అభిషేక్ ను తండ్రిచాటు బిడ్డగానే లెక్కేస్తూ వస్తున్నారు. ఆ ట్యాగ్ లైన్ ను ఎప్పటికప్పుడు తుడిచేయాలని చూస్తున్నా అది అభిషేక్ వలన కావడం లేదు. ఇక బిగ్ బి కుటుంబంపై వచ్చే రూమర్స్ కు లెక్కే లేదు. నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. అప్పట్లో అభిషేక్ - ఐశ్వర్య కూతురు.. మానసిక పరిస్థితి బాలేదని వార్తలు వచ్చాయి. ఆ తరువాత జయా బచ్చన్ - ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు పొసగడం లేదని రూమర్స్ వచ్చాయి.
ఇక కొన్ని రోజులుగా అభిషేక్ - ఐశ్వర్య విడిపోయారని పుకార్లు పుట్టాయి. అంతేకాకుండా అభిషేక్ వేరొక నటితో రిలేషన్ లో ఉన్నాడని, అందుకే ఐశ్వర్యకు విడాకులు ఇచ్చాడని కూడా మాట్లాడుకున్నారు. అయితే కొన్నిరోజులు విడివిడిగా కనిపించిన ఈ జంట.. ఇంకొన్నిరోజులు కలిసి కనిపించి నెటిజన్స్ ను సైతం కన్ఫ్యూజ్ చేసారు. ఇప్పటివరకు ఈ రూమర్స్ పై కానీ, ట్రోల్స్ పై కానీ నోరు మెదపని అభిషేక్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఏకంగా ఫైర్ అయ్యాడు. ఈ ట్రోలింగ్ వలన తాను సఫర్ అయ్యినా పర్లేదు కానీ, తన కుటుంబం సఫర్ అయితే మాత్రం అస్సలు తట్టుకోలేనని చెప్పుకొచ్చాడు.
' నాపై వచ్చే రూమర్స్ ను నేను చూస్తాను. కానీ, స్పందించను. ఎందుకంటే.. ప్రతిదానిపై స్పందిస్తే వాటికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. ఆధారాలు లేని వార్తలను నేను అస్సలు పట్టించుకోను. మొన్నటివరకు కొన్ని రూమర్స్ నన్ను మాత్రమే ప్రభావితం చేశాయి. కానీ, ఇప్పుడు అవి నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఆ రూమర్స్ వలన నా ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంది. ఇప్పుడు నేను నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితులలో ఎవరూ లేరు. ఎందుకంటే.. మంచి కన్నా చేడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ట్రోల్ చేసేవారు, మా గురించి ఇలాంటి వార్తలు రాసేవారు అసలు ఏం జరిగింది అనేది వచ్చి చూడరు. ఏది నచ్చితే అది రాసేస్తారు.
ఇలాంటి పుకార్లు రాసేవారికి మనస్సాక్షి ఉంటుందా.. అది ఉంటే కంప్యూటర్ ముందు కూర్చొని అసభ్యంగా ఒకరి గురించి రాస్తే.. అది వారిని, వారి కుటుంబాన్ని ఎంత ఇబ్బందిపెడుతుందో తెలియదా..? మీరు రాసేది చిన్న వార్తనే. కానీ, అది ఒక కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఇలాంటి వార్తలే మీ గురించి రాస్తే మీరు ఊరుకుంటారా.. ? ఇకనుంచి ఏ రూమర్ అయినా నా ముఖం మీద ధైర్యంగా అడగాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అలా ఎవరైనా ధైర్యంగా అడిగితే వారిని నేను గౌరవిస్తాను' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Manchu Vishnu: కన్నప్ప హిట్ అయినా.. బాధలో విష్ణ