Rishab Shetty: 250 రోజుల షూటింగ్ మూడేళ్ల కష్టం
ABN, Publish Date - Jul 22 , 2025 | 06:03 AM
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న భారీ చిత్రం ‘కాంతార చాప్టర్-1’. ‘రాజకుమార’, ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ వంటి విజయవంతమైన...
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న భారీ చిత్రం ‘కాంతార చాప్టర్-1’. ‘రాజకుమార’, ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ‘కాంతార చాప్టర్-1’ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దాదాపు 250 రోజుల షూటింగ్, మూడు సంవత్సరాల కష్టాన్నంతా ఈ వీడియోలో చూపించారు. ఆర్ట్ డైరెక్టర్ వినేష్ ఆధ్యాత్మిక దృశ్యాలను అద్భుతంగా డిజైన్ చేశారు. కాగా, ఈ సినిమా అక్టోబరు 2న కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కానుంది.