సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కన్నప్ప చిత్రంపై ఆ శివుడి అనుగ్రహం ఉండాలి

ABN, Publish Date - Jun 16 , 2025 | 04:38 AM

మంచు విష్ణు కథానాయకుడిగా ముఖే్‌షకుమార్‌ సింగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్‌బాబు నిర్మించారు. ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, మోహన్‌బాబు తదితరులు...

మంచు విష్ణు కథానాయకుడిగా ముఖే్‌షకుమార్‌ సింగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్‌బాబు నిర్మించారు. ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, మోహన్‌బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా కేరళలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో మోహన్‌లాల్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పుడంతా పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. ‘కన్నప్ప’ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఆ శివుడి అనుగ్రహం ఈ సినిమాపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘మోహన్‌లాల్‌ గొప్ప నటుడు. సినిమా కోసం ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా పారితోషికంగా తీసుకోలేదు. ఆయన చూపించిన ప్రేమకు రుణపడి ఉంటాను. ఆయనతో కలసి నటించాలనుంది’’ అని చెప్పారు. మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా గురించి ఇక నేను చెప్పాల్సిన పని లేదు. మీరు అల్రెడీ ట్రైలర్‌ చూశారు. సినిమా విజయంపై నమ్మకం ఉంది’’ అని అన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 04:38 AM