Manchu Vishnu: ప్రభాస్‌ వల్లే ఇంతగా ఓపెనింగ్స్‌ వచ్చాయి

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:52 PM

నటుడిగా 20 ఏళ్ల కెరీర్‌లో విజిట్‌ కార్డు ఉంటే, అది కన్నప్ప సినిమానే అవుతుందని మంచు విష్ణు అన్నారు.

Kannappa Thanks Meet


నటుడిగా 20 ఏళ్ల కెరీర్‌లో విజిట్‌ కార్డు ఉంటే, అది ‘కన్నప్ప’ (Kannappa) సినిమానే అవుతుందని మంచు విష్ణు (Manchu Vishnu) అన్నారు. ముఖేశ్‌ సింగ్‌కుమార్‌ దర్శకత్వంలో ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మోహన్‌బాబు, ప్రభాస్‌, అక్షయ్‌కుమార్‌, కాజల్‌, శరత్‌కుమార్‌; మోహన్‌లాల్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి  మంచి టాక్‌ వచ్చింది.  ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో మంచు విష్ణు మాట్లాడారు. సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలె తెలిపారు.  (Prabhas)

వర్మ మాటతో వాయిదా... 

‘‘నాకు చాలా భావోద్వేగ సమయమిది.  ఈ సక్సెస్‌ పూర్తిగా మా నాన్నకే దక్కుతుంది. దీనికి ముందు నా చిత్రాలేమీ ఆడలేదు. కానీ నమ్మకాన్ని కోల్పోలేదు. నాన్న ముందు నిరూపించుకోవాలనుకున్నా., సినిమా రషెస్‌ చూసి నాన్న ఎంతో బావుందని చెప్పారు. ఏప్రిల్‌లో విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఆర్‌జీవీ మాటలతో వాయిదా వేశాం. ఆయన మా ఇంటికి వచ్చిన సందర్భంలో బీవీఎస్‌ రవి నాతో ఉన్నారు. ‘సర్‌.. సినిమా మొత్తం గ్రాఫిక్స్‌ లేకుండా చూశా. అది యాడ్‌ అయితే, అద్భుతంగా ఉంటుందని అన్నారు. అది విని వర్మ ‘ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్‌ని వదులుతాడా అని అన్నారు. ఆ మాటలతో నాకు భయం వేసింది. అందుకే విడుదల వాయిదా వేశాం. ఎంతగా బాగా చేసినా ఎక్కడో వీఎఫ్‌ఎక్స్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇందులో కొన్ని సీన్స్‌ తీసేశాం. ఇది నాకొక గుణపాఠం. ఇలాంటివి మళ్లీ రిపీట్‌ కాకుండా చూసుకుంటా. మా తాతయ్య చనిపోతారని తెలిసిన తర్వాత నాన్న స్వయంగా ఆయన దగ్గరుండి అన్ని చూసుకున్నారు. అది చూసి నా మనసు కదిలిపోయి ఓ సీన్‌ రాసుకున్నా.


Kannappa.jpg

తప్పులున్నాయి కానీ...
ట్రోలింగ్‌కు అవకాశం ఇవ్వకుండా సినిమా చూపించగలగడం నిజంగా శివలీలే. సినిమాలో కొన్ని తప్పులున్నాయి. కానీ ఒకటే కారణంతో ప్రేక్షకులు మమ్మల్ని మన్నించారు. చివరి గంట లీనమైపోయారు. ప్రభాస్‌ ఎంట్రీతో సినిమా మొత్తం మారిపోయిందనుకున్నారు. కానీ శరత్‌కుమార్‌గారితో జరిగే సంభాషణ తర్వాత ట్రాక్‌ మారింది.  ప్రభాస్‌కు ఉన్న స్టార్‌డమ్‌ అందుకు కారణం కావచ్చు. అక్కడి నుంచే సినిమా మారిందని అందరూ భావిస్తున్నారు.  ఈ సినిమా విషయంలో ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఒతిళ్తు ఎదుర్కొన్నా. నేను చేయగలనా? లేదా? అన్న అనుమానం ఉంది. సినిమా ప్రారంభం నుంచి వ్యతిరేక ప్రచారమే జరిగింది. ఆ ఒత్తిడిని నాన్న, నా భార్య తీసుకున్నారు.’’ అని అన్నారు.  

అణుకువ నేర్చుకున్నా...
ఈ సినిమా ఎన్నో నేర్చింది. ముఖ్యంగా అణుకువగా ఉండటం నేర్చుకున్నా. ప్రభాస్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా.  ప్రభాస్‌ వల్లే సినిమాకు ఇంతగా ఓపెనింగ్స్‌ వచ్చాయి. అతడు ఉండటం వల్లే సినిమా చూడాలని థియేటర్‌కు వచ్చి ‘కన్నప్ప’ కథ తెలుసుకుంటున్నారు. జ్యోతిర్లింగాలు తిరిగేటప్పుడు నా జీవితం మారిపోయింది. ఇప్పుడు 18 శక్తి పీఠాలు తిరగాలనుకుంటున్నా. అమ్మవారు అనుగ్రహం ఇవ్వాలి. ‘కన్నప్ప’కు సీక్వెల్‌ ఉండదు. కన్నప్ప నాస్తికుడిగానే ఉంటూ అతడి కథతో ప్రీక్వెల్‌ ఎపిసోడ్‌ చేేస్త ఎలా ఉంటుందా? అని సరదాగా మాట్లాడుకున్నాం’’ అని విష్ణు అన్నారు. 

Updated Date - Jun 29 , 2025 | 05:34 AM